ఏపీ మంత్రివర్గంలో దూకుడుగా పనిచేసే మంత్రుల్లో కన్నబాబు కూడా ఒకరు...రాజకీయంగా ఈయన బలమైన మంత్రి, పైగా ఉన్న మంత్రుల్లో బాగా చదువుకున్న మంత్రి కూడా. ఓ వైపు తన శాఖపై పట్టు తెచ్చుకుని పనిచేస్తూనే మరోవైపు రాజకీయంగా ప్రత్యర్ధులపై దూకుడుగా విమర్శలు చేయడంలో ముందున్నారు. ఇలా స్పీడ్‌గా ఉన్న కన్నబాబుకు చెక్ పెట్టాలని అటు టీడీపీ, ఇటు జనసేనలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

ఎందుకంటే చంద్రబాబు, పవన్‌లపై కన్నబాబు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. అసలు తన శాఖకు సంబంధించి మీడియాలో ఎంత ఎక్కువ మాట్లాడతారో తెలియదు గాని, రాజకీయంగా ప్రత్యర్ధులపై విమర్శలు మాత్రం ఎక్కువే చేస్తారు. ఇలా దూకుడుగా ఉండే కన్నబాబుని ఓడించాలని..టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ కన్నబాబుని గెలిపించాలన్న, ఓడించాలన్న పవన్ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు.

అది ఎందుకో గత ఎన్నికల్లో పరిస్తితిని చూస్తే అర్ధమవుతుంది. ఎలాగో కన్నబాబు 2009లో కాకినాడ రూరల్ నుంచి ప్రజారాజ్యం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఆయన, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. కన్నబాబు గెలిచారని చెప్పడం కంటే..పవన్ గెలిపించారని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన విడిగా పోటీ చేయడమే కన్నబాబుకు అడ్వాంటేజ్ అయింది. ఆయన టీడీపీపై దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు...కానీ ఇక్కడ జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే అప్పుడే టీడీపీతో జనసేన జట్టు కడితే కన్నబాబు గెలుపు సాధ్యమయ్యేది కాదని చెప్పొచ్చు.

అసలు ఏ మాత్రం కూడా అవకాశం దక్కేది కాదు...సరే మళ్ళీ నెక్స్ట్ కన్నబాబుని కాపాడాల్సిందే పవన్ మాత్రమే. మళ్ళీ పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే కన్నబాబు సులువుగా గెలిచేయొచ్చు. ఒకవేళ పొత్తు పెట్టుకుని కాకినాడ రూరల్ సీటు జనసేనకు తీసుకున్న లేదా టీడీపీకి ఇచ్చిన సరే, కన్నబాబుకు చెక్ పెట్టొచ్చు. అంటే కన్నబాబు భవిష్యత్ పవన్ చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: