తెలంగాణ మంత్రులైన ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లను  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  కలిశారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు కేటాయించామని వారు కోరారు. గ్రామాల్లో సిసి రోడ్లు మరియు లింక్ రోడ్లకు సంబంధించి నిధులు కేటాయించామని తెలియజేశారు. పర్యాటక ప్రాంతాలు  అభివృద్ధికి సహకరించాలని  కోరారు. ఈ మంత్రులను  కలిసినా ఎమ్మెల్యేలలో సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్కతోపాటు సీతక్క మరియు శ్రీధర్ బాబులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. అలాగే కెసిఆర్ యొక్క అపాయింట్మెంట్ కూడా కాంగ్రెస్ నేతలు కావాలని మంత్రులను అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ను సర్కార్ దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనతో మాకు కెసిఆర్  అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎల్పీ నేతమల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ ను కోరినట్లు సమాచారం.

 మరొకవైపు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కేసీఆ ర్ ను ఇలా రిక్వెస్ట్ చేయడం చాలా ఆసక్తి రేపే అంశంగా మారింది.
 ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో జీవో నెంబర్ 317 సవరించాలని, వరి ధాన్యం కొనుగోలు, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్లు, విషయమై పోరు బాట పడుతున్న కాంగ్రెస్ నేతలు, ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు సిద్ధమైపోయారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెప్పాలని నేతలు డిసైడ్ అయ్యారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ ఒక లేఖ రాశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ బట్టి విక్రమార్క ప్రజా సమస్యలను వివరించడం కోసం కెసిఆర్ ని సమయం కోరినట్లు తెలుస్తోంది.

మొదటి వారంలో ఎప్పుడైనా సరే తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ దృష్టికి వచ్చిన సమస్యలను విన్నవించుకుంటామని ఆ లేఖలో రాశారు. కేంద్రంలోని బిజెపి మంత్రులు టిఆర్ఎస్ మంత్రులకు ఎంపీలకు సమయం ఇస్తున్నారని, కానీ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని తెలంగాణ రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిస్తే వారి సమస్యలను వినే పరిస్థితి లేదని తెలియజేశారు. కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లో సమస్యలను చెప్పుకోవడానికి కూడా కనీసం సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోతామని కాంగ్రెస్ నాయకులు విన్నవించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: