దేశ వ్యాప్తంగా `ఆర్ ఆర్ ఆర్` సినిమా వసూళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇండియన్ ఎకానమీలో కూడా `ఆర్ ఆర్ ఆర్` సినిమా వసూళ్లు పెద్ద చర్చనీయంశంగా మారాయి.తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా `ఆర్ ఆర్ ఆర్` సినిమా వసూళ్ల తో రికార్డులు సృష్టించినట్లే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా రోజుల్లో రికార్డు సృష్టిస్తుందని జోస్యం చెప్పడం జరిగింది.`ఆర్ ఆర్ ఆర్` సినిమా 750 కోట్లు వసూళ్లు సాధించిందని నేను కూడా విన్నాను. అదే విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా రికార్డులను బద్దలు కొడుతుందని నేను భావిస్తున్నాను. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఎగుమతి సంఖ్య $418 బిలియన్లకు చేరుకోవడంపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హర్షం ఆనందం చేసారు.మొత్తానికి `ఆర్ ఆర్ ఆర్` సినిమా సెగ కేంద్రానికి కూడా తాకింది. కేంద్ర మంత్రులే `ఆర్ ఆర్ ఆర్` సినిమా వసూళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ సినిమా ఉత్తరాదిన కూడా బాగా పుంజుకున్నట్లుగానే భావించడానికి దీన్ని ఒక సంకేతంగా భావించొచ్చు.



ఇక ప్రధాని మోడీ గారు ఈ `ఆర్ ఆర్ ఆర్` సినిమా గురించి మాట్లాడటమే బ్యాలెన్స్. సెలబ్రిటీల్ని మోఢీ ఏ స్థాయిలో పొగిడేస్తారో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.`ఆర్ ఆర్ ఆర్` సినిమా విషయం ఆయనకు తెలిస్తే ప్రధాని మోడీ సైతం మెచ్చకుండా ఉండలేరు కదా. అయితే ఇక్కడ మరోక విషయం గుర్తించాలి. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు సినిమాల్ని తక్కువ చేస్తున్నారని గతంలో కొన్ని విమర్శలొచ్చాయి. ఓ పెద్దింటి సెలబ్రిటీ కోడులు నేరుగా పీఎంని టార్గెట్ చేసి కామెంట్ చేశారు. తెలుగు నటులు..బాలవుడ్ నటులకు ఏ మాత్రం తీసిపోరాని కామెంట్ చేశారు. ఓ వేడుక ఆహ్వానం లో భాగంగా నరేంద్ర మోడీ కేవలం బాలీవుడ్ కే అతిధ్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పై అప్పట్లో టాలీవుడ్ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR