తెలంగాణ నేతలతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో నేతలు కార్యకర్తలకు రాజకీయ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని పవన్ తెలిపారు.అలాగే తెలంగాణలో పార్టీ నేతలు వివిధ విభాగాల అధ్యక్షులు వీర మహిళలు కార్యకర్తలు మొత్తం 32 మందితో పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. వారితో తెలంగాణలో ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రజాపక్షం వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని వారికి పవన్ కళ్యాణ్ అనుకున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి నేతలు ఇంకా శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే జనసేన పార్టీ డివిజన్ స్థాయి సమావేశాలపై చర్చించారు.అయితే.. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీకి పొత్తు ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఆయన సిద్ధమయ్యారు. అయితే బీజేపీ నేతల నుంచి వచ్చిన వినతితో నామినేషన్లు వేసి కూడా విత్ డ్రా చేసుకున్నారు.


ఇక దీంతో జనసేన మద్దతుతో ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఆ తర్వాత బీజేపీ తమను పట్టించుకోవడం లేదని.. ముఖ్యమైన విషయాలు తమతో చర్చించడం లేదని వార్తలు వచ్చాయి. ఎఇక మ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవికి మద్దతుని ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన వాణి దేవి గెలుపొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడుస్తారో లేక టీఆర్ఎస్ తో కలిసి నడుస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉందని అంటున్నారు.అలాగే టీఆర్ఎస్ కూడా పవన్ కల్యాణ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయిన కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ పవన్ కల్యాణ్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి హైదరాబాద్ నగరంలో కొన్నిచోట్ల అలాగే తెలంగాణలో ఒకటి రెండు చోట్ల టికెట్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: