‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో వైసీపీకి 18 లోక్ సభ సీట్ల గ్యారెంటి’..ఇండియా టుడే సర్వే.


‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది’..చంద్రబాబునాయుడు


పై రెండు ప్రకటనల్లో ఎంతటి వైరుధ్యముందో అర్ధమవుతోందా ? మొదటి ప్రకటనేమో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టు డే దేశవ్యప్తంగా నిర్వహించిన సర్వే. ఏపీలో కూడా సర్వేచేసిన సదరు సంస్ధ వైసీపీకి 18 లోక్ సభ సీట్లు గ్యారెంటీ అని తేల్చింది. లోక్ సభలో 18 సీట్లంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఎందుకంటే ప్రతి లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లుంటాయి. కనీసం ఐదు అసెంబ్లీల్లో మెజారిటి వస్తే కానీ ఒక లోక్ సభ స్ధానం గెలవటం కష్టం.

అంటే లోక్ సభ సీట్లకు సదరు సంస్ధచేసిన సర్వేని అసెంబ్లీ సీట్లకు కూడా వర్తింపచేస్తే వైసీపీకి ఓ వంద సీట్లు వస్తాయని అనుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డే రెండోసారి సీఎం అవటం ఖాయమని అర్ధమవుతోంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా సమయం ఉందికాబట్టి ముందుముందు ఇంకెన్ని సర్వేలు చేస్తుందో ? అప్పటి మూడ్ ఆప్ ది నేషన్ ఎలాగుంటుందో తెలీదు.

సీన్ కట్ చేస్తే రెండు ప్రకటన చంద్రబాబు చేస్తున్నది. చంద్రబాబు ఏమీ సర్వేచేయించుకుని వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని చెప్పటంలేదు. జగన్ ఓడిపోవాలి, తాను అర్జంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలనే బలమైన కోరికతో చెబుతున్న మాటలు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కోరికకు ఎల్లోమీడియా తానతందాన అంటోంది కాబట్టి రాష్ట్రంలో జనాలంతా జగన్ అంటే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ గెలుచుకునే సీట్లసంఖ్యలో ఇండియా టు డే నిర్వహించిన సర్వే వివరాలు కరెక్టా ? లేకపోతే చంద్రబాబు, ఎల్లోమీడియా చెబుతున్నది కరెక్టా ? అవును అసలు ఇండియా టు డే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలు ఎల్లోమీడియా ఎందుకని అచ్చేయలేదు ?


 మరింత సమాచారం తెలుసుకోండి: