చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారు.అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఈ వార్తలతో చైనాలో పెను సంక్షోభం తలెత్తిందని సమాచారం తెలుస్తోంది.చైనా ఆర్మీ పాలకుడిపై తిరుగుబాటు చేసిందనే ప్రచారం సాగుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ( పీఎల్ఏ) గా పిలుచుకునే చైనా సైన్యం ప్రపంచంలోనే అతి పెద్దది. అయితే పీపీఏ సైన్యం దేశ రాజధాని బీజంగ్ దశగా కదులుతోంది. వేలాది మంది సైన్యంరాజధాని దిశగా వెళుతోంది. బీజింగ్ వైపు 50 వేల మంది పీపీఏ సైన్యం వెళుతుందని. బీజింగ్ దారిలో కిలోమీటర్ల నేర సైన్యం వాహనాలే కన్పిస్తున్నాయని కథనాలు వస్తున్నాయి. దీంతో చైనాలో ఏదో జరుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి.చైనా అధ్యక్షుడిగా ప్రస్తుతం జిన్ పింగ్ ఉన్నారు. చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా జిన్ పింగ్ ను ప్రకటించారు.


జిన్ పింగ్ నియంతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కొన్ని రోజులుగా వస్తున్నాయి.పైకి నవ్వుతూ కనిపించే జిన్ పింగ్ చాలా క్రూరంగా ఆలోచిస్తారని అంటారు. ఆయన నియంత పోకడలు పెరగడంతో కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటు వచ్చిందని తెలుస్తోంది. జిన్ పింగ్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలో తీర్మానం జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిన్ పింగ్ ను సైన్యం హౌజ్ అరెస్ట్ చేసిందని తెలుస్తోంది.ఈ నెల 16న షాంఘై కో ఆపరేషన్ సదస్సు లో పాల్గొని వచ్చారు జిన్ పింగ్. ఆ సదస్సు నుంచి రాగానే విమానాశ్రయంలో జిన్ పింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు బీజింగ్ వైపు చైనా సైన్యం కదులుతుండటంతో చైనాలో సంక్షోభం తలెత్తందని అంటున్నారు. చైనా మిలటరీ చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి చాలా బలమైన రాజ్యంగా బడాయిగా చెప్పుకునే చైనాకి ఆ దేశంలో సైనిక చర్చ జరిగితే అది పెను సంచలనమే..మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: