ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే దేశంలో మరో రాష్ట్రము బీజేపీ కి వశమయ్యేలా కనిపిస్తోంది. త్వరలో ప్రధాని మోదీ అనుకుంటున్నా విధంగానే అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ జెండాను ఎగురవేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. అందుకు అనుకూలంగానే ప్రతిపక్ష పార్టీలు సైతం అనవసర తప్పిదాలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాయి. కాగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ కొన్ని రోజుల నుండి ఇక్కడ రాజకీయంగా వాతావరణం బాగాలేదు. ముఖ్యంగా సీఎం గా ఉన్న అశోక్ గెహ్లాట్ మరియు స్పీకర్ జోషిల కారణంగా అసలుకే మోసం వచ్చే పరిస్థితి నెలకొంది. అధికార వర్గంలో ఉన్న 92 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాను ఇచ్చారు.

అయితే వీరంతా కూడా సచిన్ పైలట్ ను సీఎం చేయద్దని తెలిపుతుండడం విశేషం. అయితే ఎవరోఒకరు మన సీఎం గా ఉండాలని కోరుకోకుండా సొంత పార్టీలోనే ఇలా శత్రువులు ఉండడం నిజంగా బాధాకరం. అయితే ఈ ఇగో కారణంగా రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలన ప్రారంభం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు మొత్తం ఆట స్పీకర్ జోషి చేతుల్లోనే ఉంది.. ఎమ్మెల్యే ల రాజీనామాను ఆమోదిస్తే ఖేల్ ఖతం. కాగా 90 శాతం ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, సీఎం అత్యవసర సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. కానీ ఇప్పటి వరకు అశోక్ గెహ్లాట్ అలా చేయకపోవడం గమనార్హం. ఏది ముందుకు సాగాలన్నా స్పీకర్అ తీసుకునే స్టెప్ప్పు లోనే ఉంది.

ఆ తర్వాతనే రాష్ట్రంలో రాష్ట్రప్రతి పాలన గురించి క్లారిటీ వస్తుంది. కాగా సచిన్ పైలట్ కు కూడా భారీ ఆఫర్ లను ఇస్తోంది. ఇప్పటికైనా ఇంచి పోయింది లేదు బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నాము అంటూ రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు.  మరి కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేస్తుందో మరియు సచిన్ పైలట్ ఎలా మారనున్నారో అన్నారు అన్నది ప్రస్తుతానికైతే డైలమాలో ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: