తాజాగా వెలువడిన శాసనమండలి పట్టభద్రుల రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ గెలవగానే ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టేసింది. ఏ స్ధాయిలో వార్తిచ్చిందంటే ప్రభుత్వంపై ‘పట్టభద్రుల తిరుగుబాటు’ అంటు పెద్ద బ్యానర్ కథనం ఇచ్చేసింది. తన కథనానికి మద్దతుగా కొన్ని లెక్కలిచ్చింది. ఇలాంటి లెక్కలను నమ్ముకునే చంద్రబాబునాయుడు 2019లో ముణిగిపోయింది. రెండుచోట్ల వైసీపీ ఓడిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. కాకపోతే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత మొదలైంది అని తెలుసుకునేందుకు ఇదొక సంకేతంగా ఉపయోగపడింది.





రెండుస్ధానాల్లో టీడీపీ గెలవటానికి వైసీపీలో జరిగిన తప్పులే ఎక్కువ కారణం.  ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ చౌదరి గెలిచారు. టీడీపీ గెలుపును తక్కువగా చూడాల్సిన అవసరంలేదు. కాకపోతే రెండుస్ధానాల్లో గెలవగానే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ చేయటమే విచిత్రంగా ఉంది.  దీన్నిపట్టుకునే చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు కూడా రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 9 జిల్లాల్లోని 108 నియోజకవర్గాల్లో వాళ్ళు ఓట్లేశారట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 7.16 లక్షల మంది ఓట్లేసినట్లు చెప్పింది.





పై జిల్లాల్లోని పట్టభద్రుల్లో మెజారిటి టీడీపీకే ఓట్లేశారట.  10 శాతం ఓటర్లు వైసీపీకన్నా టీడీపీవైపే మొగ్గుచూపినట్లు రాసింది. 175 నియోజకవర్గాల్లో ఏకంగా 108 నియోజకవర్గాల్లో టీడీపీ వైపు జనాలు మొగ్గుచూపారు కాబట్టి ఇంకేముంది జగన్ పనైపోయిందని తేల్చేసింది. ఇక్కడ ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే ఈ ఎన్నికలు మొత్తం ఓటర్ల తీర్పుకాదు. మొత్తం ఓటర్లలో పట్టభద్రులు కేవలం ఒక వర్గం మాత్రమే.





సగటున ప్రతి జిల్లాలోను 25 లక్షల మంది ఓటర్లున్నారని అనుకుంటే మొత్తం ఓటర్లు సుమారు 2.25 కోట్లమందవుతారు. అందులో ఇపుడు ఓట్లేసిన పట్టభద్రులు కేవలం 7 లక్షలు మాత్రమే. 2.25 కోట్ల మంది ఓటర్లలో 7 లక్షల ఓటర్లెంత ? ఈ 7 లక్షల్లో మెజారిటి టీడీపీకి ఓట్లేస్తే వైసీపీ పనైపోయినట్లేనా ? మరిదే సమయంలో 2 టీచర్ల నియోజకవర్గాల్లోను వైసీపీ గెలిచిందికదా ? అలాగే 14 ఎంఎల్సీ స్ధానాల్లో వైసీపీ 12 గెలిస్తే టీడీపీకి దక్కింది 2 సీట్లే కదా ? ఇపుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని ఎల్లోమీడియా తీర్మానించేయటమే విచిత్రంగా ఉంది. ఇలాంటి పిచ్చిలెక్కలను నమ్ముకుంటే టీడీపీ ముణిగిపోవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: