తక్కువ డబ్బులతో ఎక్కువ దూరం ప్రయాణించడం రైళ్లలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే రైళ్లలో టికెట్ల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. సామాన్య మానవుడు ఎక్కువ దూరాన్ని తక్కువ డబ్బులతో వెళ్లడం రైళ్లలోనే సాధ్యం. కాబట్టి చాలామంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. బస్సుల్లో ప్రయాణం కూడా కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దానికి ఇష్టపడరు. రైలు మార్గాన్ని ఎంచుకుంటారు ముఖ్యంగా దూర ప్రయాణం చేయాలంటే రైళ్లను ఆశ్రయిస్తారు. ఇలాంటి సమయంలో రైల్వే శాఖ కొత్త నిర్ణయం ప్రకటించింది. గతంలో ముందు డబ్బులు చెల్లించి తర్వాత ప్రయాణం చేయడం అందరికీ తెలిసిన విషయమే.


ఇప్పుడు రైల్వే శాఖ టికెట్లు బుకింగ్ చేసే ఐఆర్సిటిసి ప్రస్తుతం పేటీఎంతో లింకప్ అయింది.  పేటీఎం నుంచి టికెట్ బుక్ చేసుకోండి ముందు ప్రయాణించండి.. తర్వాత డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది.  ఇది నిజంగా సంచలన నిర్ణయం.  ప్రయాణం చేసిన తర్వాత డబ్బులు చెల్లించడం అనేది ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన. దీనిని చాలామంది ప్రయాణికులు అభినందిస్తున్నారు.


ప్రస్తుతం పేటీఎం నుంచి రైల్వే శాఖ ట్రావెల్ నౌ పే లేటర్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. అంతే ముందుగా ప్రయాణించడం తర్వాత డబ్బులు చెల్లించడం. పేటీఎం ద్వారా ఐఆర్సిటిలోకి ఎంటర్ చేసి బుక్ టికెట్ పై క్లిక్ చేయాలి. అనంతరం పేమెంట్ సెక్షన్లో లేటర్ అనే ఆప్షన్ ని ఎంచుకొని పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆఫర్ ని తీసుకోవాలి. అనంతరం పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటిపిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.


మరో సంస్థ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే కూడా 3 నెలల నుంచి ఆరు నెలల వరకు ఈఎంఐ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. పింటెక్ సంస్థ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 13,14 రోజుల్లో చెల్లించవచ్చు. లేకపోతే 36 శాతం టికెట్స్ పై ఇంట్రస్ట్ పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: