మాజీమంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే తనపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిందనే కోపంతో జస్వంతిరెడ్డిపై అఖిల పరువునష్టం దావా వేయటమే. ఇపుడు అఖిల వేసిన పరువునష్టం దావా ముందు ముందు ఎన్ని మలుపులకు కారణమవుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే నంద్యాలలో లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం గుర్తుందికదా. ఆ పాదయాత్ర సంరద్భంగా లోకేష్ నంద్యాలకు చేరుకోగానే సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల మద్దతుదారులు దాడిచేసి చచ్చేట్లు కొట్టారు.
ఏవీ ఫిర్యాదుతో పోలీసులు అఖిల మీద హత్యాయత్నం కేసు నమేదుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 7 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ మీద అఖిల జైలు నుండి బయటకు వచ్చారు. ఆ దాడి తర్వాత జస్వంతిరెడ్డి మాజీమంత్రిని టార్గెట్ చేస్తు రెండు వీడియోలు రిలీజ్ చేవారు. అందులో అఖిలపై చాలా ఘాటువ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వార్నింగులు కూడా ఇచ్చారు. దాంతో అఖిలకు మండిపోయింది. ఇంతకీ జస్వంతి ఎవరంటే ఏవీ సుబ్బారెడ్డి కూతురు+మరో సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు కోడలు.
ఇపుడు అర్ధమైంది కదా జస్వంతి బ్యాగ్రౌండ్ ఏమిటో ? ఏవీపై అఖిల మద్దతుదారుల దాడి తర్వాత మాజీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని ఇటు ఏవీ అటు బోండా గట్టిగా పట్టుబట్టారట. ఇద్దరు కూడా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులు అన్న విషయం తెలసిందే.
ఒకవైపు చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిపోతోంది మరోవైపు అఖిల దూకుడూ పెరిగిపోతోంది. కబ్జాలు, కిడ్నాపులు, హత్యా యత్నాలు, ఫోర్జరీల కేసులు అఖిల మీద పెరిగిపోతోంది. ఎన్నికేసులుంటే ఎన్నిసార్లు జైలుకెళితే అంత గొప్పని అఖిల అనుకుంటున్నారేమో తెలీటంలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో టీడీపీ నేతగా అఖిల మీద పెరిగిపోతున్న కేసులు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. రేపటి ఎన్నికల్లో జనాలకు సమాధానాలు చెప్పుకోవాలంటే కచ్చితంగా అఖిల మీద చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్లుగా పరిస్ధితులు ముదిరిపోతున్నాయి. అందుకనే అఖిలను పార్టీలో నుండి బయటకు పంపేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి