
టీడీపీతో పొత్తులో ఉన్నప్పటి కీ జనసేన నేతలు మాత్రం మన పార్టీ అజెండానే ముందుకు తీసుకెళ్లాలని సూచనలు చేశారు. అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే టీడీపీ, జనసేన పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్టీల క్యాడర్ మధ్య కూడా అసంతృప్తులు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీతోనే జనసేన పొత్తు కుదరదనే అభిప్రాయాలు కనిపించాయి. బీజేపీతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తరుచూ చెప్పేవారు. అయితే.. టీడీపీని కూడా తమతో పొత్తులోకి తీసుకోవడానికి పని చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఏకంగా టీడీపీతో కలిసి వెళ్లుతామని ప్రకటించడం సంచలనమైంది. బీజేపీ నుంచి ఇంకా ఈ అంశంపై స్పష్టత లేదు.