
ఇక నందమూరి బాలకృష్ణ తన ప్రసంగంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ తొడగొట్టి మీసం తిప్పితే.. వెళ్లి సినిమాల్లో చేసుకో.. ఇక్కడ కాదు అని నా వృత్తిని అవమానించాడు. అతడు మీసం తిప్పితే.. రా తేల్చుకొందాం అని నేను మీసం మెలేసీ.. తొడగొట్టాను. రా తేల్చుకొందామని సవాల్ విసిరాను. నేను ఎవరికి భయపడే వాళ్లం కాదు. ప్రజా క్షేత్రంలో తేల్చుకొంటాం అని బాలకృష్ణ అన్నారు.అమరావతి రాజధాని కోసం నిరాహార దీక్షలు చేసిన వారిని పెయిడ్ ఆర్టిస్టులని ఐటీ మంత్రి అన్నారు. అయితే ఐటీ కాంక్లేవ్ పేరుతో నిర్వహించిన సమావేశానికి వచ్చిన వారందరూ జూనియర్ ఆర్టిస్టులు కాదా? అని బాలయ్య ప్రశ్నించారు. ఉపాధి కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం పెడితే.. అవినీతి జరిగిందని సాక్ష్యాలు లేకుండా చంద్రబాబును జైల్లో పెట్టారు. కేసులు, కోర్టులు, అరెస్ట్‌లకు భయపడేది లేదు అని బాలకృష్ణ అన్నారు.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నారు. పవన్ కల్యాణ్, కీలక నటులపై పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి చేసినట్టు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు కొంత విరామం ప్రకటించి.. నాలుగో విడుత వారాహి విజయ యాత్రను సెప్టెంబర్ 31వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.