ఇపుడీ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు.  బీజేపీ నేతలేమో తాము జనసేన మిత్రపక్షాలమే అని పదేపదే చెప్పుకుంటున్నారు. కానీ జనసేన అధినేత పవన కల్యాణ్ ఏమో పొరబాటున కూడా బీజేపీ తమ మిత్రపక్షమే అని చెప్పటంలేదు. తాజాగా అసలు రెండుపార్టీల మధ్య పొత్తుందా లేకపోతే చిత్తయ్యిందా కూడా అర్ధంకావటంలేదు.





కృష్ణాజిల్లా వారాహియాత్ర సందర్భంగా పెడనలో మాట్లాడుతు తెలుగుదేశంపార్టీ పరిస్ధితి చూసిన తర్వాత తనకు కష్టంగా ఉన్నా ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు. అయితే ముదినేపల్లిలో మాట్లాడుతు తాను జనసేనలోనే ఉన్నట్లు చెప్పారు. దాంతో జనసేన అసలు ఎన్డీయేలోనే ఉందా లేదా, బీజేపీతో కంటిన్యు అయ్యే విషయంలో పవన్ మనసులోని మాటేమిటి అన్నది అర్ధంకావటంలేదు. రెండుపార్టీలు కలిసుండటం రెండుపార్టీల్లోని నేతలకు ఇష్టంలేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే రెండుపార్టీలు కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటికడా లేదు. 





ఏదేమైనా పొత్తుల్లో కంటిన్యు అవటం రెండుపార్టీలకు ఏమాత్రం ఇష్టంలేదని అర్ధమైపోతోంది.  దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారా ? అనే అనుమానం మొదలైంది. ఎందుకంటే తన టార్గెట్ మొత్తం జగన్నోహన్ రెడ్డి మీదే ఉంచుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను పొరబాటున కూడా పురందేశ్వరి ప్రస్తావించటంలేదు.  కాబట్టి పొత్తుల విషయంలో పురందేశ్వరికి అధికారం ఇస్తే కచ్చితంగా టీడీపీతో రెడీ అయిపోతారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.




ఇక్కడ సమస్య ఏమిటంటే తనంతట తానుగా బీజేపీని జనసేన వదిలేస్తే పవన్ తో పాటు దగ్గరకు తీసుకున్నందుకు చంద్రబాబును ఇద్దరినీ బీజేపీ పెద్దలు ఓ రేంజిలో ఆటాడుకుంటారు. స్కిల్ స్కామ్ లో అరెస్టు, రిమాండు దెబ్బకే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు, టీడీపీ తల్లకిందులైపోతోంది. టీడీపీ పరిస్ధితి చుక్కానిలేని నవాలాగ తయారైపోయింది. దీనికితోడు బీజేపీ పెద్దల ఆగ్రహం తోడైతే అదికూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ ఇద్దరు ఒకేదెబ్బకు అన్యాయమైపోతారు. ఈ విషయాలన్నీ పవన్ కు ఎవరో చెప్పుంటారు. అందుకనే సడెన్ గా బీజేపీ విషయంలో యూటర్న్ తీసుకున్నది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: