తెలంగాణ రాజకీయం ప్రస్తుతం ఎన్నో సంచలనాలకు కేరాఫ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా.. ఇక డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఫలితాలలో ఎవరు ఊహించని రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుందని అయితే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొన్ని సీట్లు తగ్గుతాయని.. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కొట్టడం ఖాయమని అందరూ ఊహించారు.


 కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దూకుడును ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో నింపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అనూహ్యమైన  రిజల్ట్  వచ్చింది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లకు మంచి ఏకంగా నాలుగు సీట్లు ఎక్కువగానే వచ్చాయి అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ అయితే గెలిచింది కానీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో అనే విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. అయితే ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎందుకుంది.


 అయితే మిగతా నేతల  నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది అనుకున్నప్పటికీ.. సీనియర్లను కాంప్రమైజ్ చేయడం కూడా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలు తేర మీదికి వస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి పాలమూరు నుంచి సీఎం అయిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. గతంలో హైదరాబాద్ స్టేట్ కి కల్వకుర్తికి చెందిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇక ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత ఇదే ప్రాంతం నుంచి రేవంత్ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. కాగా రేవంత్ రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్లోని కొండారెడ్డిపల్లి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: