అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇక ఈ ముఖ్యమంత్రి సీటు పంచాయితీ ఢిల్లీ వరకు వెళ్లగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డికే సీఎం పీఠాన్ని అప్పగించారు. ఇక మిగతా మంత్రుల నుంచి అసంతృప్తి రాకుండా సర్ది చెప్పారు అని చెప్పాలి. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. ఇక మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఇదే కార్యక్రమంలో జరిగింది అని చెప్పాలి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం వైరల్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి చేపట్టకుండానే డైరెక్ట్ గా సీఎం అయిన పొలిటీషియన్ గా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. గతంలో ఇలా ఎవరు మంత్రిగా పనిచేయకముందే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ లు గతంలో మంత్రులుగా పని చేయకుండానే డైరెక్ట్గా సీఎం అయిపోయారు. అయితే వీరిలో కనీసం గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేయకుండా మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ముఖ్య మంత్రి పీఠాన్ని అధిరోహించింది మాత్రం ఎన్టీఆర్ అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి