ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవకాశమిస్తే పోటీ చేస్తానంటూ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం, రామన్నపాలెంలో జన్మించిన తనకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుమతి ఇస్తే.. గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు హీరోయిన్ శ్రీరాపాక. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అందులో రాజకీయాల్లో ఆమె తన ఆసక్తిని వెల్లడించారు. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ రికమండేషన్ పైన కూడా ఆమె స్పందించారు.ఇక తాజాగా ఈ విషయాలపై స్పందించిన శ్రీరాపాక... పదోతరగతి దాకా తాను సొంత ఊరిలోనే ఉన్నట్లు తెలిపారు. ఆ తరువాత ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి... సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా సుమారు తెలుగు, తమిళ్ ఇంకా కన్నడ లో సుమారు 50 - 60 సినిమాలకు డిజైనర్ గా పని చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్తవారికి కూడా అవకాశాలిస్తూ, కొత్త జనరేషన్ ని ఎంకరేజ్ చేస్తూన్నారని ఆమె అన్నారు. ఇదే సమయంలో 2014 వ సంవత్సరం నుంచి తాను కూడా తనస్థాయిలో చిన్న చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలా చిన్న చిన్నవి కాకుండా... రాజకీయాల్లోకి వస్తే జనాలకు ఇంకా ఎన్నో సేవలు చేయొచ్చని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా తన కోరికని మన్నించి జగన్ మోహన్ రెడ్డి తనకు టిక్కెట్ ఇస్తే... గోపాలపురం నియోజకవర్గానికి మనసా వచా కర్మనా అన్ని విధాలా హార్ట్ ఫుల్ గా, సిన్సియర్ గా సేవ చేస్తానని ఆమె తెలిపారు. ఇదే సమయంలో దర్శకుడు రాం గోపాల్ వర్మ రికమండేషన్స్ తో పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: