ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా ఆసక్తికరంగా ఉంది.ఇప్పటిదాకా వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన అన్నట్లుగా ఉన్న రాజకీయం కాస్తా ఇప్పుడు త్రిముఖ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ సమయంలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ విజయవాడలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్ షర్మిలకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో వైఎస్ షర్మిలకు మొదటి షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఆమె ప్రయణిస్తున్న కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎనికే పాడు దగ్గర కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.ఇందులో భాగంగా తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ లీడర్స్ అయిన గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీతో పాటు ఇతర శ్రేణులు నిరసనగా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల పోలీసులపై కోపం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆసక్తికరంగా కూడా స్పందించారు.ఈ సందర్భంగా కారులో నుంచే మీడియాతో మాట్లాడిన షర్మిళ కాంగ్రెస్ పార్టీని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. కావాలనే తమ కాన్వాయ్‌ ను దారి మళ్లించారని షర్మిల తెలిపారు. ఈ క్రమంలో... "భయపడున్నారా సర్?" అని షర్మిళ వ్యాఖ్యానించడం హైలెట్గా నిలిచింది. కాగా ఇటీవల షర్మిళ కొడుకు రాజారెడ్డి నిశ్చితార్ధం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: