వచ్చే ఎన్నికలలో జనసేన టిడిపి పార్టీ కలిసి ఎలక్షన్స్ లో పాల్గొనబోతున్నాయి. ఇప్పటికి సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని కూడా పూర్తి చేశారు..పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు మిగతా నియోజవర్గాలలో టిడిపి అభ్యర్థులు పోటీ చేయబోతున్నారట.. ముఖ్యంగా రెండు పార్టీలు పరస్పరం అంగీకారంతోనే ఓట్ల బదిలింపు ఉంటుంది అంటూ ముందుకు వెళుతున్నారు.. తాడేపల్లిగూడెంలో రెండు పార్టీలు కలిసి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిన్నటి రోజున.. ఇదంతా ఇలా ఉండగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు విషయంలో ఎలక్షన్స్ కమిషనర్ తీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు..


ఇప్పుడు ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలంటూ కూడా ఈసీ ఆదేశాలను జారీ చేసింది.. అయితే దీంతో పాటు జనసేన పోటీ చేయని నియోజక వర్గాలలో కూడా అదే గాజు గ్లాస్ ను కూడా ఫ్రీ సింబల్గా పెట్టవచ్చని నిర్ణయాన్ని తీసుకుందట.. దీంతో 24 అసెంబ్లీ మూడు పార్లమెంటు నియోజకవర్గం జనసేన అభ్యర్థులు గాజు గుర్తుపైన పోటీ చేయాలని.. మిగిలినటువంటి 151 యొక్క అసెంబ్లీ 22 ఎంపీ స్థానాలలో గాజు గ్లాస్ గుర్తుపైన ఎవరైనా పోటీ చేయవచ్చు అంటూ వెల్లడించారు.


ఒకవేళ ఈ గుర్తుపైన ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే టిడిపికి భారీ నష్టం ఏర్పడుతుంది.. పొత్తులో భాగంగా పడాల్సిన ఓట్లన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులకే పడే అవకాశం ఉంటుందట.. ఒకవేళ వైసీపీ రంగంలో దిగితే ఈ పొత్తు పార్టీకి  మరింత నష్టం చేకూరుతుందని కూడా వినిపిస్తోంది. ఈ విషయం పైన జనసేన పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన ఎక్కువ చెందుతున్నారట.. ఇప్పటి వరకు పొత్తు బాగానే ఉన్న జనసేన పోటీ చేయని స్థానాలలో గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ కావడంతో కచ్చితంగా ఈ గుర్తు తమ కొంప ముంచుతుంది అనే భయం టిడిపి పార్టీలో మొదలయ్యింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: