పార్టీ నేతలైన కచ్చితంగా ఎన్నికల ముందు మేనిఫెస్టోని విడుదల చేస్తూ తాము అధికారంలోకి వస్తే వీటిని చేస్తామంటూ తెలియజేస్తూ ఉంటారు... ఆంధ్రాలో రాబోతున్న ఎన్నికల సమయంలో టిడిపి పార్టీ ,వైసిపి పార్టీ ,కాంగ్రెస్, బిజెపి పార్టీ వంటివి రకరకాల మేనిఫస్టులను విడుదల చేస్తూ ఉన్నారు.. ఇప్పటికే టిడిపి పార్టీ సూపర్ సిక్స్ అంటూ పలు రకాల మేనిఫెస్టో పథకాలను విడుదల చేశారు.. కానీ ప్రజలు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోయే వైసిపి మేనిఫెస్టో గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..వైసీపీ మేనిఫెస్టోని చాలా మంది నేతలతో కూర్చొని మాట్లాడి మరి పక్కా ప్రణాళికతో రూపొందిస్తున్నారు. టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు మించి ఉండేలా సరికొత్త మేనిఫెస్టో పైన జగన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే పార్టీ నేతలు ఇచ్చిన సలహాల మేరకు.. 2019లో వైసీపీకి గెలుపు కారణమైన నవరత్నాల పైన మరొక సారి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది అలాగే వీటితో పాటు సరికొత్త పథకాలను కూడా చేర్చబోతున్నారట.. ముఖ్యంగా యువత, రైతులు మహిళల పైన ఫోకస్ పెడుతూ మేనిఫెస్టోను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు..


అలాగే రైతు రుణమాఫీ తో పాటు రైతు భరోసా పెంపు పైన కసరత్తు చేస్తున్నారని యువత మహిళలకు ఉపాధితో పాటు వృత్తి కూడా కల్పించే విధంగా మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మ్యానిఫెస్టోను ఎన్నికల నోటిఫికేషన్ లోపే ప్రకటించే విధంగా ఏపీ సీఎం ప్లాన్ చేస్తున్నారట.. వైసీపీ సీనియర్ నేతలతో కూర్చొని మరి పక్కా ప్రణాళికతోనే ఈ మేనిఫెస్టోను సిద్ధం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆఖరి సిద్ధం సభలో తుది జాబితాలను సైతం ప్రకటించిన తరువాతే మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని వైసిపి  పార్టీ భావిస్తోంది.. మరి ఎలాంటి అంశాలు ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: