అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో పోటీ చేయబోతోంది.. దీంతో నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ మాట్లాడుతూ తన కుమార్తె నేహా శర్మ గురించి పలు విషయాలను తెలియజేశారు.. భాగల్పూర్ తమకు మంచి పట్టున్న నియోజకవర్గం అని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూటమిలో చాలా సీట్లు రావాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు.. పోత్తులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సీటు వస్తే తమ కుమార్తెను కూడా ఎంపీ అభ్యర్థి బరిలో దింపేలా ప్రయత్నాలు చేస్తున్నానని లేకపోతే నేనే పోటీ చేస్తానంటూ తెలిపారు.
అయితే అజిత్ శర్మ మాత్రం తన కూతురిని రాజకీయాలలోకి తీసుకువచ్చేందుకు హై కమాండ్స్ తో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.. ఒకవేళ అక్కడ స్థానం కాంగ్రెస్ పార్టీకి వస్తే తాను తన కుమార్తె ఇద్దరూ ఎవరో ఒకరు పోటీ చేయాలన్నది హై కమాండ్ నిర్ణయిస్తుందంటూ తెలియజేశారు అజిత్ శర్మ.. అయితే నేహా శర్మ ప్రస్తుతం సినిమాలలో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆఫర్స్ ఎక్కువగా రాకపోవడంతో ఈమె రాజకీయాల వైపే అడుగులు వేసేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి