ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని  పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.ఇక ఇప్పటికే అక్కడ నాలుగు రోజుల ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ స్థానికంగా నివాసం ఉండేలా ఒక అద్దె ఇంటిని కూడా సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ క్యాంపెయినర్స్ ని కూడా రంగంలోకి దించడం జరిగింది.ఇదే సమయంలో... తన గెలుపుని పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ చేతుల్లో పెడుతున్నట్లు తెలిపారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఎలాగైనా ఓడించి తీరాలని వైసీపీ  కట్టుకుందని అంటున్నారు. ఇప్పటికే వంగా గీత ప్రచారంలో బాగా దూకుడు ప్రదర్శిస్తుంటే... మరోవైపు ముద్రగడ పద్మనాభం రూపంలో కూడా గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుందని చెబుతున్నారు.ఇంకా అదే విధంగా... ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్ ఛార్జ్ మిథున్ రెడ్డి కూడా పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించారని.. రాబోయే ఎన్నికల్లో పవన్ కు గట్టి షాకిచ్చేలా పథకాలు రచిస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... జగన్ మోహన్ రెడ్డి కూడా పిఠాపురంలో ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం తెలుస్తుంది.


అయితే ఇవి చాలవన్నట్లు తాజాగా మరో సమస్య పిఠాపురంలో జనసేనానికి వచ్చిందని సమాచారం తెలుస్తుంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ని ఎలాగైనా ఓడించి తీరాలని అధికార పార్టీ అన్ని రకాల వ్యూహాలూ అమలుపరుస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలనొప్పిగా మారబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే అందుకు ప్రధాన కారణం... నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ అవ్వడమే అని అంటున్నారు.పిఠాపురంలో ఊహించని పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగబోతోందని సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి పేరు కే. పవన్ కల్యాణ్ అని అంటున్న నేపథ్యంలో... ఆ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ కావడం.. ఆ సింబల్ గాజు గ్లాసు గుర్తుకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుండటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో జనసేనాని పిఠాపురంలో గట్టెక్కుతారా.. లేదా అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: