హిందూపురం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు రెండుసార్లు గెలిచారు ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే విధంగా సినిమా షూటింగులను బందు చేసి మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటీవలే ప్రచారంలో భాగంగా హిందూపురం నియోజకవర్గం లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇలాంటి సమయంలోనే బాలయ్యకు జన నీరాజనం పలుకుతున్నారు.. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రోడ్లు కూడా నిండిపోతున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జనసేన బీజేపీ టిడిపి కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం సృష్టించబోతోందంటూ బాలయ్య హిందూపూర్ లో నిర్వహించినటువంటి ఒక సభలో మాట్లాడడం జరిగింది.


తాజాగా బాలయ్య మాట్లాడుతూ.. అధికార పార్టీ అయినా వైసీపీ పార్టీకి ఓటు వేస్తే దొంగలకు  తాళాలు ఇచ్చినట్టే అంటూ తెలిపారు బాలయ్య.. స్వర్ణాంధ్ర సహకార యాత్రలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ ఎమ్మిగనూరులో శివ సర్కిల్లో బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది బాలయ్య. వైసిపి పాలనలో రాష్ట్రంలో ఉండే వ్యవస్థలు అన్ని ఆగిపోయాయి.. జగన్ ఒక నియంతల నయవంచకుడిగా మారారంటూ తెలియజేశారు. లక్ష కోట్లు దోపిడీ చేశారంటూ బాలయ్య ఫైర్ అవడం జరిగింది. 1600 కోట్ల ప్రజాధనాన్ని వృధాగా హోర్డింగుల కోసం చేశారంటూ కూడా ఎద్దేవ చేశారు.ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ.. దళిత బిడ్డలకు శిరోమండలం చేశారు.. ప్రశ్నిస్తే దాడులకు దిగబడ్డారంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా మార్చేసారంటూ బాలయ్య సభలో మాట్లాడారు. వైసిపి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ భూములు ఆస్తులను వదులుకొని రాష్ట్రం వదిలి కొని పోవాల్సి వస్తుందంటూ.. ప్రజలంతా ఏకమై దుర్మార్గపు పాలనను మట్టి కల్పించాలి.. ఓటు నీ సరిగ్గా ఉపయోగించుకొని ప్రజాస్వామ్య పాలనను తీసుకువచ్చేలా చేయాలంటూ బాలయ్య పిలుపునిచ్చారు. టిడిపి పార్టీ కూటమిలో భాగంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారని విషయం పైన కూడా బాలయ్య తెలియజేస్తూ ప్రజలతో కలిసి ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: