ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. వైసిపి, టిడిపి కూటమి, కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోరు ఏర్పడింది. ఈ పోరులో గెలుపు ఎవరిది అనేది చెప్పడం కష్టంగా మారింది. ప్రజానాడి ఏ సర్వేకు కూడా అంతుచిక్కడం లేదు. ఎవరు గెలిచినా కొద్దిపాటి ఓట్లతోనే గెలుస్తారని ,మెజారిటీ అయితే రాదని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇదే తరుణంలో  టిడిపి కూటమి ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే, వైసీపీ  ఒంటరిగా ప్రజల్లోకి వెళ్తోంది.  ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తానని గట్టిగా నమ్ముతున్నారట. 175 సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు తప్పక వస్తాయని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారట. దూరపు కొండలు నునుపు అన్నట్టు, తప్పక తానే గెలుస్తానని  తన మీటింగ్లకు వచ్చిన జనాభాను చూసి  జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

రియల్ గా మాత్రం ప్రజలు జగన్ పై వ్యతిరేకతతోనే ఉన్నారట. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు చాలావరకు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలకు మాత్రమే అందాయని  నిజమైన పేదలకు అందలేదనే మైనస్ ప్రజల్లో ఉందట.  2019 ఎన్నికల్లో గెలిచినటువంటి చాలామంది వైసిపి నాయకులు అనేక దందాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, అభివృద్ధి చేయడంలో వెనుకంజ వేశారనే  అంశం కూడా ప్రజల్లో ఉన్నది. కానీ జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు ను, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ  రాష్ట్రమంతా బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే ఆయన బస్సు యాత్ర  చేస్తున్న సమయంలో కాకినాడ కాలేజీ విద్యార్థులు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. అంతేకాకుండా జగన్ పై రాయి దాడి కూడా ఎంతో మైలేజ్ ఇస్తుందని భావించాడు.

అది కాస్త బెడిసి కొట్టింది. అయితే రాష్ట్రంలో వైసిపి  అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కిందిస్థాయి నేతలు ప్రజలను ఇబ్బంది పెట్టారని,  జగన్ కు ఓటు వేయకుంటే పథకాలు రావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ,  దీనివల్లే  ఎక్కడ సభ పెట్టిన వెళ్తున్నారు కానీ ఓటు వేసే అవకాశం మాత్రం కిందిస్థాయి వర్గాల్లో కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఇలాగే  కాంగ్రెస్ అధికారంలోకి రాదని, నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయనే అహంభావంతోనే ముందుకు వెళ్లారు. కానీ రిజల్ట్ వచ్చేసరికి కంగుతిన్నారు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా తండోపతండాలుగా జనాలు వచ్చారు. కానీ ఓట్లు వేసే సమయంలో మాత్రం  కాంగ్రెస్ వైపు ఎక్కువ ఓట్లు పడ్డాయి. జగన్ కూడా కేసీఆర్ లాగే ఆలోచన చేస్తూ తానే గెలుస్తాననే అపోహలో ఉన్నారని, ఆయన అదే అపోహతో ఉంటే మాత్రం తెలంగాణలో కేసీఆర్ కు ఏ విధమైన పంచ్ పడిందో, జగన్ కు కూడా ఆ విధంగానే పంచ్ పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: