ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఎన్నికలు ముగిశాక నేతలు ఎవరు పెద్దగా బయటికి వచ్చి మాకు ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్పడం లేదు. దానితో ఎవరికి తోచిన... ఎవరికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు ఈ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. వీరు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్తూ వస్తున్నారు. ఇకపోతే ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతూ మేమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము అని ప్రకటించాడు. ఇక అసలు జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఏం మాట్లాడారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఎలక్షన్ల అనంతరం తాజాగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ టీం తో సమావేశం అయ్యారు. అందులో భాగంగా జగన్ మాట్లాడుతూ ఈ సారి కూడా అధికారంలోకి రాబోతున్నాము. రాబోయే ఫలితాలను చూసి దేశం షాక్ కాబోతోంది. పోయినసారి అధికారంలోకి వస్తాము అంటే ఎవరు నమ్మలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని నమ్మారు. అందుకే 151 అసెంబ్లీ స్థానాలను ఇచ్చి మమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చారు.

ఇక ఈ సారి కూడా మేము 151 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ సాధించి అధికారం లోకి రాబోతున్నాము. అలాగే పోయిన సారి కంటే కూడా ఈ సారి ఎక్కువ పార్లమెంటు స్థానాలను కూడా మేము సాధించబోతున్నాము. ప్రజలు మేము చేసిన ఐదు సంవత్సరాల పరిపాలనకు పూర్తి మద్దతు ఇచ్చారు. దానితో ఆంధ్రప్రదేశ్ జనాలు అంతా మా వైపు నిలబడ్డారు. వారంతా మా పార్టీకే ఓటు వేశారు. మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము అని ప్రకటించాడు.

ఇక గత కొంతకాలంగా ఐ ప్యాక్ చేస్తున్న సేవలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని ఈ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రెండు నిమిషాల వీడియోతోనే జగన్ కూటమి వర్గాలకు ముచ్చమటలు పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటే తప్ప ఎలక్షన్ల తర్వాత ఇలా మాట్లాడడు. ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు అంటే జగన్ ఈసారి కూడా గెలుస్తాను అనే నమ్మకంతో ఉన్నాడు అందుకే ఇలాంటి మాటలు మాట్లాడాడు అని కూటమి వర్గ ప్రజలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: