2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ జెండా మరోసారి కచ్చితంగా ఎగురుతుందా అనే ప్రశ్నకు టీడీపీ నేతల దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. కుప్పంలో బాబుకు ఘోర పరాజయం తప్పదని ప్రచారం నేతగా అది ప్రచారం కాదు నిజమేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. కుప్పంలో వైసీపీకి తిరుగులేదని బాబు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాష్ట్రంలో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ మళ్లీ సీఎం కావడం గ్యారంటీ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన చెప్పుకొచ్చారు. కుప్పంలో గత ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని అందువల్ల కుప్పంలో తమ పార్టీకి తిరుగులేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కామెంట్లతో వైసీపీ నేతలు ఎంతో సంతోషిస్తున్నారు.
 
కుప్పం నియోజకవర్గంలోనే ఫలితం ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ను తక్కువగా అంచనా వేయడమే టీడీపీ, జనసేనలకు మైనస్ అయిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రజల్లో వైసీపీకి మద్దతు ఎందుకు ఉందో అంచనా వేయడం కూటమి నేతలకు అస్సలు సాధ్యం కాలేదని చెప్పాలి.
 
2019 ఎన్నికల ఫలితాల నుంచి కూటమి నేతలు ఎలాంటి పాఠాలను నేర్చుకోలేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ నేతలకు జూన్ 4వ తేదీన దిమ్మతిరిగే ఫలితాలు రానున్నాయని తెలుస్తోంది. వైసీపీలో ఉన్న ధీమా కూటమి నేతల్లో మాత్రం లేదనే చెప్పాలి. గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీకి ఆ ప్రయత్నాలు వృథా ప్రయత్నాలుగానే మిగిలిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు కూటమిని చిత్తు చేయబోతుందని తెలుస్తోంది. ముస్లింల ఓట్లు అన్నీ వైసీపీకి పడటం ఆ పార్టీకి ఎంతగానో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమికి జగన్ గట్టి షాకులే ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: