పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996 లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2004 నుండి 2009 వరకు వెల్దుర్తి జెడ్పిటిసిగా పని పని చేసిన ఈయన 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచెర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వై యెస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తన పదవికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2012 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పిన్నెల్లి జాయిన్ అయ్యారు.

2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబు పై 16200 ఓట్ల మెజారిటీ తో రెండో సారి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2014 , 2019 ఎన్నికలలో కూడా ఈయన మాచర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇది ఇలా ఉంటే ఈయన 2023 వ సంవత్సరం కూడా వైసీపీ పార్టీ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు.

ఇక మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈయన మాచర్ల నియోజకవర్గం లోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ 202 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ బూత్‌లో జొరబడి ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా అతని మీద ఐపీసీలోని 143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135 లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా జూన్‌ 5 ఉదయం 10 గంటల వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ జూన్ 6 వ తేదీన మళ్లీ విచారణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది అప్పటినుండి పిన్నెల్లి కి కోర్టు ద్వారా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: