ఒక గూటి పక్షులు ఎప్పటికీ విడిపోవు అంటారు. విడిపోయిన కానీ దేవుడు మళ్ళీ అదే గూటికి చేరుస్తాడని సామెత ఉంది.  ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో  జగన్ షర్మిల వేరు వేరు పార్టీల నుంచి బరిలో ఉన్నా కానీ చివరికి  వారు కలిసే విధానమే కనబడుతోంది. పార్టీల పరంగా వేరైనా కానీ  ఒకే రక్తం పంచుకు పుట్టిన వారు కాబట్టి  దేవుడు వారిని కలుపుతాడు అనడంలో అతిశయోక్తి లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల మానియా నడుస్తోంది. మే 13న ఎన్నికలు ముగిసాయి కానీ, జూన్ 4న అసలు సినిమా ఉంది. 

ఎవరి భవితవ్యం ఏంటి, ఎవరు కాబోయే సీఎం అనేది తప్పనిసరిగా జూన్ నాలుగు  ఒంటిగంట వరకు బయటపడుతుంది. ఇదే తరుణంలో అన్ని పార్టీల నాయకులు  రకరకాల కసరత్తులు చేస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీలలో ఇలా ఉంటే,  కేంద్రంలో మరో లెక్క ఉంది. ఈసారి మేము ఎలాగైనా అధికారంలోకి వస్తామని మోడీ చెపుతుంటే, మేమే కూటమి  అధికారంలోకి రానున్నదని  రాహుల్ చెబుతున్నారు.  ఈ విధంగా ఎవరి అంచనాలను వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే  కూటమి ముందుగానే ఆలోచన చేసి షర్మిలాను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంది. దీని ద్వారా  తన అన్న జగన్ ను  కూటమికి సపోర్ట్ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 అయితే ఇంతకుముందు ఆయన బిజెపికి సంబంధించి ఎక్కువగా సపోర్టెడ్ గా ఉండేవారు.  బిజెపి టిడిపి తో కలవడంతో కేంద్రంలో కాంగ్రెస్ జగన్ కు ప్రత్యామ్నయంగా ఉంది.  దీంతో కాంగ్రెస్ పెద్దలు జగన్ ను ముందుగానే  ఇండియా కూటమిలో కలిపేసుకోవాలని ఆలోచన చేస్తున్నారట.  కానీ జగన్ మాత్రం తన మద్దతు కావాలంటే తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా మీద హామీ ఇవ్వాలని కోరుతున్నారట. ఒకవేళ ఇది వర్కవుట్ అయితే మాత్రం జగన్  ఇండియా కూటమివైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల అన్నా చెల్లెలు తప్పక  కలిసిపోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: