ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రన్న పాలనపై ఏపీ ప్రజలు గంపెడాశలు పెట్టుకోగా ఆ ఆశలను చంద్రబాబు నిజం చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో తెలుగుదేశానికి మరో ఐదేళ్లు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో మంత్రి వర్గ కూర్పు పూర్తైన నేపథ్యంలో చంద్రబాబు మంత్రి వర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
 
కమ్మ, కాపు ఓటర్లు తమకు ఎప్పటికీ అండగా నిలబడతారనే ఆలోచనతో బాబు ఈ పని చేశారని తెలుస్తోంది. చంద్రబాబు ఏపీ ఓటర్ల మనస్సు గెలవాలంటే మాత్రం ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా పూర్తిస్థాయిలో పెద్దగా షరతులు లేకుండా నెరవేర్చాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సీనియర్లకు మాత్రం చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
 
భవిష్యత్తు యువతదే అని చంద్రబాబు బలంగా నమ్మారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యువ రక్తంతో పార్టీ పుంజుకోవడం పక్కా అని చంద్రబాబు ఫీలవుతున్నారని తెలుస్తోంది. లోకేశ్ కు అనుకూలంగా ఉండే నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారనే కామెంట్లు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2029 సమయానికి లోకేశ్ సీఎం అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
పదవులు దక్కని వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు వాళ్లను బుజ్జగించనున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు రాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. సరైన దారిలో అడుగులు వేస్తున్న చంద్రబాబు పరిపాలనలో తన మార్క్ చూపించడంతో పాటు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలుపుతారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలు పర్ఫెక్ట్ గా అమలై రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాల ప్రజలను సంతృపరిచేలా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: