ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అనుభవం ఉంది. 74 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు తన ప్రతిభతో మరోమారు సీఎం అయ్యారు. మరో ఐదేళ్లు బాబుకు ఢోకా లేనట్టేనని పొలిటికల్ వర్గాల్లో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పదుల సంఖ్యలో హామీలు ఇచ్చినా ఆ హామీలలో ప్రధానమైన హామీలు మాత్రం 12 హామీలు ఉన్నాయి.
 
ఆ 12 హామీలను కచ్చితంగా చెప్పిన విధంగా అమలు చేస్తే మాత్రం చంద్రబాబుకు తిరుగుండదని వైసీపీ నేతలకు సైతం నోరెత్తే ఛాన్స్ అయితే ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని హామీల అమలు దిశగా అడుగులు పడగా జులై 1 నుంచి ఆ హామీలు అమలు కానున్నాయి. చంద్రబాబు తాను ఇచ్చిన 12 హామీలను చెప్పిన విధంగా అమలు చేస్తే మాత్రం తిరుగుండదని చెప్పవచ్చు.
 
చంద్రబాబు ఇచ్చిన హామీలలో కొన్ని సంచలన హామీలు సైతం ఉన్నాయి. 50 ఏళ్లకే పింఛన్ లాంటి హామీల అమలు ఎప్పటినుంచి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ తరహా హామీలను ఎంత వేగంగా అమలు చేస్తే అంత వేగంగా ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది. వాలంటీర్లకు జీతాల పెంపు విషయంలో సైతం బాబు అడుగులు జాగ్రత్తగా పడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆర్థికంగా కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే మీడియా అనుకూలంగా ఉండటం బాబుకు ఒకింత ప్లస్ కానుంది. బాబు ఏం చేసినా మీడియా వైపు నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఒకింత తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను వెల్లడించి హామీలను అమలు చేస్తే బాబుకు ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన న భూతో న భవిష్యత్ అనేలా ఉండాలని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: