ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణఇచ్చి, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఎపిఎస్ఎస్డీసి ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. దీనిద్వారా ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. తొలిఏడాది లక్షమందికి, రెండు, మూడు సంవత్సరాల్లో లక్షన్నర మందికి చొప్పున మొత్తం 4లక్షలమందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా శిక్షణ ఇస్తారు.


ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్స్, ఓసిఐ ఫౌండేషన్స్, ఎఐ ఫౌండేషన్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్స్ పై శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. అప్ డేటెడ్ వర్షన్స్ లో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల కోసం లెర్నింగ్ కంటెంట్ ను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేసి అభ్యర్థులకు అందిస్తారు. అదనపు మద్దతు, నెట్ వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది.  ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన ఈ కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  ఒరాకిల్ అందించే ఎస్ డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందిస్తుంది. ఒరాకిల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపికచేస్తారు.


ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ ఎండి & సిఇఓ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దినేష్ కుమార్, ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్రకుమార్, సీనియర్ సేల్స్ డైరక్టర్ దేబప్రియ నందన్, వైస్ ప్రెసిడెంట్ (జపాక్ స్కిల్ డెవలప్ మెంట్) తపస్ రాయ్, టెరిటరీ సేల్స్ మేనేజర్ షకీల్ అహమ్మద్ మొహమ్మద్, ప్రిన్సిపాల్ క్లౌడ్ ఆర్చిటెక్ట్ వెంకటశివ నక్కా, కంట్రీ హెడ్ అశ్లేష ఖండేపార్కర్ తదితరులు పాల్గొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: