భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్ లో అల్లకల్లోలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి ఇండియన్స్ కి పలు రకాల బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన కొన్ని గంటలకు పాకిస్తాన్ నుండి తిరుపతి వాసికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే తిరుపతి లాంటి ప్రదేశానికి  ఫోన్ కాల్స్ రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ పోలీసులు అప్రమత్త మైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.


తిరుపతి వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్ సంభాషణ గురించి ఆ వ్యక్తి మాట్లాడుతూ.. బుధవారం ఉదయం తనకు ఒక కాల్ వచ్చిందని అయితే ఆ కాల్ మాట్లాడిన వ్యక్తి పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నట్లుగా తెలియజేశారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించారని ఫోన్ కాల్ వినగానే సైబర్ నెరగాళ్లు కావచ్చు అని ఆలోచించాను కానీ ఆ తర్వాత చూస్తే పాకిస్తాన్ నుండి అన్నట్లుగా గ్రహించానని.. తనకు ఏం కావాలి అని ప్రశ్నించగా.. అలా ఫోన్ కాల్ మాట్లాడుతూ మరో ఐదు నిమిషాలలో మీ ఇంటి పైన బాంబులు వేస్తామని మీ కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరించారట. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


అయితే ఈ ఇండియన్ వ్యక్తి మాత్రం నిన్న రాత్రి జరిగింది సరిపోలేదా అంటూ పరుష పదాజాలంతో ఘాటుగానే స్పందించినట్లు తెలియజేశారు అనంతరం ఈ విషయం పైన పోలీసులకు తాను సమాచారం అందించాను అంటూ మీడియాతో మాట్లాడారు. ఈ విషయం అందిన వెంటనే తిరుపతి పోలీసులు అలర్ట్ అయి తన నుంచి వివరాలను సేకరించినట్లు సమాచారం. మరి ఆ వ్యక్తికి కాల్ చేసింది సైబర్ నేరగాల లేకపోతే ఉగ్రవాదులు అనే విషయం తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతిలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లు ఒక్కసారిగా అలర్ట్ అయినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: