ఆపరేషన్ సింధూర్‌ పేరుతో భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త‌ల‌కు తెర లేవ‌డంతో ఉత్తరాదిన పలు విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు. అయితే ఈ ప్రభావం ఐపిఎల్ 2025 మ్యాచ్ పైన పడింది. ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య మే 11న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈ మ్యాచ్ ను అహ్మదాబాద్ కు మార్చారు. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది .. మేం వెంటనే అంగీకరించాం . . ఈరోజు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నగరానికి చేరుకుంటారు . . పంజాబ్ జట్టు ప్రయాణ ప్రణాళికలు ఇంకా తెలియ రాలేదు అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తాజా గా తెలిపింది.


ధర్మశాల ఎయిర్పోర్ట్ మూసివేత కారణంగానే ముంబై జట్టు అక్కడికి వెళ్ళటం లేదని తెలుస్తోంది. ఇక ధర్మశాల వేదికగా నేడు పంజాబ్ .. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యధావిధిగా జరగనుందని ఐపిఎల్ నిర్వహకులు తెలిపారు. ఈ మ్యాచ్ కోసం ఎప్పటికి రెండు జ‌ట్లు అక్కడికి చేరుకోవడంతో ప్రయాణ సమస్య తలెత్తలేదు.. కానీ సాయంత్రం సమయంలో మ్యాచ్ ల‌ వినియోగం భద్రతా పరమైన సమస్యగా మారింది. దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందా లేదా ? అనే దానిపై సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది ..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: