
ఆర్బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటిదాకా రద్దయిన రూ.2 వేల నోట్లలో .. 98.26 శాతం నోట్లు మాత్రమే తిరిగి బ్యాంక్‌కు వెళ్లాయిట .. అంటే దీని ప్రకారం ఇంకా 1.74 శాతం నోట్లు జనం వద్ద మిగిలిపోయినట్టు .. ఈ 1.74 శాతం రూ.2 వేల నోట్ల విలువ ఎంత అంటే .. దాదాపు 6,181 కోట్లు దాకా ఉంటుందని అంటున్నారు .. ఇన్నేసి కోట్ల విలువచేసే రూ.2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉన్నాయా .. అంటే కొంత ఆశ్చర్య పడాల్సిన పనిలేదు .. ఎందుకంటే కొంతమందికి రూ.2 వేల నోట్లను మార్చుకొని మార్గాలు తెలియకపోవచ్చు లేదంటే .. పెద్ద పెద్ద బడా బాబులు వాటిని తమ రహస్య గదుల్లో దాచుకొని ఉండొచ్చు .
ఇక ఏదేమైనా రద్దయిన ఈ రూ.2 వేల నోట్లు సామాన్య ప్రజల వద్ద ఉన్నాయా .. బడా బాబుల వద్ద ఉన్నా .. అవి పనికిరావు కదా .. నిజంగా అవి చెల్లుబాటు కావు అంటే ప్రభుత్వానికి ఏమీ నష్టం కాదు కానీ .. వాటిని భద్రంగా దాచుకున్న వారికి మాత్రం నష్టం అయితే ఈ తరహాలో నష్టాలను కూడా నివారించేందుకు మరో మారు ఆర్బిఐ రంగంలోకి దిగింది .. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామంటూ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది .. ఈ ప్రకటన ప్రకారం ఎంపిక చేసిన పలు పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లి మన వద్ద ఉన్న 2 వేల నోట్లను మార్చుకునేందుకు గొప్ప అవకాశం ఇస్తున్నామంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది .. అలాగే ఈ ప్రకటన ప్రకారం ఆ ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లి .. మన వద్ద ఉన్న ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు .. అలాగే గతంలో వచ్చిన భారీ సమయానికే స్పందించిన జనం ఇప్పుడు మాత్రం ఏ అంతవరకు స్పందిస్తారు అనేది చూడాలి ..