
ఆడవాళ్లకు ఎక్కడ ఏ అపాయం జరుగుతుందో తెలియదు . మగవాళ్ళు వారిని ఏదో రకంగా హింస్కు గురి చేస్తూనే వస్తున్నారు. చిన్న వారి నుంచి ముసలి వారి వరకు ఎవరికీ ఎలాంటి రక్షణ లేకుండా పోయింది .. ఇంట్లో బయట ఎక్కడ నమ్మేటట్టు లేదు .. మగ మృగల నుంచి స్త్రీ జాతిని కాపాడడం కష్టంగా మారింది ఈ క్రమంలో తాజా అధ్యయనాల ప్రకారం .. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య ఘనంగా పెరుగుతూ వస్తుంది .. అలాగే రెండు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అధిక సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి ప్లేస్ లో ఉండటం ఆందోళన కూడా కలిగిస్తుంది .. అంతేకాకుండా రెడ్ లైట్ హాట్ స్పాట్ల పరంగా .. అంటే సెక్స్ వర్క్ జరుగుతున్న ప్రాంతాల సాంద్రతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది .. అలాగే ప్రతి హాట్ స్పాట్లలో సకుటున 38 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉంటున్నారని కూడా అంచనా వేస్తున్నారు .. అలాగే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది ..
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేకమంది మహిళలు ఇతర ఆదాయం మార్గాల వైపు ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారు .. అలానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఉద్యోగ అవకాశాలు రాకపోవటంతో ఇలాంటి వృత్తి లోకి వస్తున్నట్లు నివేదిక చెబుతుంది . అలాగే సెక్స్ వర్క్ చేసే మహిళల్లో హెచ్ఐవి , ఇతర లైంగిక వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందె ప్రమాదం ఎక్కువగా ఉండటంతో .. సామాజిక ఆరోగ్య రంగానికి కూడా ఇదొక క్లిష్టమైన చాలెంజిగా మారుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు .. ఇది కేవలం అంకెల్లో పెరుగుదల కాదని ఆర్థిక ఆరోగ్య సామాజిక మానవ హక్కుల కోణాల్లో సమగ్ర దృష్టి పెట్టి చూడాలని పలువురు ప్రముఖులు చెబుతున్నారు ..