ఇతర దేశాలలో ఉండే చట్టాలు మన ఇండియాలో ఉంటే చాలా సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. సాధారణంగా ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు వచ్చిన ఇక్కడ పట్టించుకోరు. కానీ విదేశాలలో అయితే కచ్చితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆస్ట్రేలియా తరహా చట్టాలు మన దేశంలో ఉంటే రోజుకి ఎన్ని వేల మంది మరణిస్తారో తెలియదట. ఆస్ట్రేలియాలో భర్తతో భార్య గొడవ భార్యతో భర్త గొడవ చాలా ప్రమాదం.. మన దగ్గర అయితే చాలానే జరుగుతూ ఉంటాయి.


ఆల్కహాల్ తాగి భార్యని కొట్టేవారు,అలాగే చాలా నిర్లక్ష్యంగా ఇతరత్రా కారణాల చేత గొడవలు పడేటువంటివి మన దేశంలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. హక్కుల కోసం పోరాటం బాధ్యతలని వదిలేసినటువంటి ఆరాటం.. ప్రస్తుతం ఇది దంపతుల మధ్య విభేదాలకు కారణమవుతున్నది. అలాగే తల్లితండ్రుల జోక్యాలతో జరుగుతున్నటువంటి పరిణామాలు మరికొన్ని.. ఆస్తుల మీదన ఆశతో కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయేవి మరికొన్ని.. అయితే ఇలాంటివి జరిగితే గృహహింస కేసులు వంటివి ఉన్న 100 కి 90 శాతం వరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవు.


ఇక విడిపోవాలనుకున్నప్పుడు లేకపోతే డబ్బులు కాజయాలనుకున్నప్పుడు, లేకపోతే తట్టుకోలేని హింస ఉన్నప్పుడే స్టేషన్స్ మెట్లు ఎక్కుతూ ఉంటారు. కానీ విదేశాలకు వెళ్తే మాత్రం అక్కడ చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.. చివరికి సరదాగా జరిగిన సంఘటన కూడా ప్రాణాలు తీసే పరిస్థితి కనిపించిన ఉదంతం ఇప్పుడు జరిగింది. అది ఆస్ట్రేలియాలో జరిగింది.. భారత సంతతి వ్యక్తి ఆస్ట్రేలియా ఆడ్లేట్ పోలీసులు అతి చేశారంట. అసలు విషయంలోకి వెళితే గౌరవ్ కుండీ (42 ఏళ్లు) అమృత్ పాల్ కౌర్ దంపతుల మధ్య చిన్న వాగ్వాదం జరిగిందట. అయితే వీటిని గమనించిన పెట్రోల్ పోలీసులు గృహహించగా భావించారట. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి గౌరవ్ నీ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చిన్న వాగ్వాదామని అమృత్ వాదించినప్పటికీ కూడా పోలీసుల వినిపించుకోలేదు.


తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవ్ వేడుకున్న కూడా పోలీసులు కనికరించలేదట.. దీంతో అరెస్టు చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఒక పోలీస్ అధికారి మోకాలితో  తన భర్త తలను పోలీసు వాహనానికి బలవంతంగా తాకడంతో గౌరవ్ అక్కడ స్పృహ కోల్పోయాడంటూ  అమృత్ పాల్ ఆరోపణలు చేసింది.. అయితే వైద్యులు తెలిపిన మేరకు అతని మెదడు, మెదడులో నరాలు దెబ్బతిని మరణించారని చెప్పారట.


అయితే గౌరవ్ కొంతమేరకు ఆల్కహాల్ తీసుకొని వచ్చి తన భార్య అమృత్ ను తోయడం జరిగిందట.. అయితే ఈ విషయాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూసి ఇది గృహహింస కేసు అని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నించారట.. ఆ సమయంలోనే ఇలాంటి ఘటన జరిగిందట. అయితే అక్కడ గృహహింస కేసు అనేది చాలా పెద్దదట.

మరింత సమాచారం తెలుసుకోండి: