
అనిల్ రావిపూడి చెప్పినది చెప్పినట్టే చేసి చూపించే దర్శకుడు. ఆయన గతంలో చేసిన ప్రతి ప్రాజెక్ట్‌లోనూ అదే ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన హాస్యం, మాస్ ఆడియన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్, ఫ్యాన్స్‌కి కావాల్సిన హైప్ – అన్నింటినీ ఒకే మిక్స్‌లో పెట్టి తెరకెక్కించగల పవర్ అనిల్ రావిపూడి దగ్గరే ఉంది. ఆయన లాస్ట్ తెరకెక్కించిన – “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సూపర్ డూపర్ హిట్‌గా దూసుకెళ్లింది. ఆ సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఒక్కటే – “అనిల్ రావిపూడి తర్వాత ఎవరితో వర్క్ చేయబోతున్నాడు..?” అన్నది.
చాలామంది ఊహలు ఊహలుగానే మిగిలిపోయాయి. కానీ ఆ లక్కీ ఛాన్స్ అనిల్ కి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చాడు. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందన్న వార్త బయటకు రాగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండడం మరింత స్పెషల్. అంతేకాదు, “మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు” అనే టైటిల్ ఫిక్స్ కావడం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. ఇప్పుడంతా ఎదురుచూస్తున్నది ఒకే ఒక విషయం – మెగా అప్డేట్. సినిమా యూనిట్ ఇప్పటికే అధికారికంగా చెప్పేశారు, దసరా కానుకగా మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ రిలీజ్ అవుతుందని. ఆ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌కి మరింత కిక్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇదే – “అప్డేట్ ఏంటి?” అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.ఆ సర్ ప్రైజ్ ఏదైనా సరే అనిల్ రావిపూడి చెప్పాడు అంటే టైంకి చేస్తాడు అని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.
అనిల్ రావిపూడి గురించి ఒక మాట ఎక్కువగా వినిపిస్తుంది – “ఆయన డైరెక్టర్ కాదు, ఓ పండగలా ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చే మాంత్రికుడు” . తనదైన స్టైల్, తనదైన నమ్మకం, ముఖ్యంగా టైంకి మాట నిలబెట్టుకోవడం – ఈ కాంబినేషన్ వల్లే ఆయనకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు చిరంజీవితో చేసే ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్తుందని అందరూ నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతుంది ఒకే ఒక మాట –“అనిల్ రావిపూడి డేరింగ్‌ని బీట్ చేసే వాళ్లే లేరు… ఆయన చెప్పాడు అంటే అదే టైంకి చేస్తాడు!” కొంత మంది ఇంత డేర్ ఏంటి సార్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!