
ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను వదిలిపెట్టేది లేదని కచ్చితంగా శిక్షిస్తామంటూ బాధితురాలికి హామీ ఇచ్చారట. అంతేకాకుండా బాధితురాలు పిల్లల చదువు కోసం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. మరొకసారి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఎవరు పాల్పడినా కూడా అసలు వదిలిపెట్టనంటూ హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఇక మీదట డబ్బుల కోసం ఎవరూ కూడా మహిళల జోలికి వెళ్లకూడదంటూ వెళితే దారుణమైన పరిస్థితిలో ఉంటాయని హెచ్చరించారు.
మహిళల పైన ఇలాంటి దుర్మార్గవంగా ప్రవర్తించిన వారిని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బాధితురాలు పిల్లల చదువు కోసం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తూ పెద్ద పాపను స్కూలులో చేర్పించి హాస్టల్లో ఉండేలా చేయడమే కాకుండా మరో ఇద్దరు పిల్లల చదువులను కూడా సీఎం చంద్రబాబు 5 లక్షల రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చారట. ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా ఉండాలని ఆ బాధ్యత మహిళలకు ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తానికి తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారుతోంది.