తెలంగాణలో మూడవ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బిజెపి పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. నేతల మధ్య ఒకరికొకరికి పడకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బిజెపి అంటే హిందుత్వవాదం పై నడుస్తూ ఉంటుంది. అలాంటి హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే బీజేపీ లీడర్లలో రాజాసింగ్ ఒకరు.. తెలంగాణలో బిజెపి అంటే తెలియక ముందే ఆయన హిందుత్వ వాదాన్ని పట్టుకొని బిజెపి తరఫున నిలబడుతూ వచ్చారు.. అలాంటి రాజా సింగ్ బిజెపిలో సముచిత స్థానం లేదని, ప్రస్తుతం బిజెపి తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేసేది  ఇప్పుడున్న నాయకులే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు బిజెపి పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పి అధిష్టానానికి కూడా పంపించారు. 

మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ ఆయన అధిష్టాన నిర్ణయాన్ని బట్టి తన కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు.. ఒకవేళ తన రాజీనామాను ఢిల్లీ అధిష్టానం ఆమోదపరిస్తే తప్పకుండా హిందూ ధర్మం కోసం పనిచేస్తానని అన్నారు రాజా సింగ్.. కట్ చేస్తే రాజాసింగ్ భారతీయ రాష్ట్ర సమితిలోకి వెళ్లబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం హరీష్ రావు అని తెలుస్తోంది. హరీష్ రావు రాజాసింగ్ మంచి స్నేహితులట. ఇద్దరు తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటారట.. ఈ విషయాన్ని రాజా సింగ్ స్వయంగా వెల్లడించారు.. దీన్నిబట్టి చూస్తే రాజాసింగ్ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి చూడాలి హరీష్ రావు తన మిత్రుడిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తారా.. లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

 అంతేకాకుండా రాజాసింగ్ బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి వల్లే పార్టీ ఎదగడం లేదని, అధిష్టానం నాకు వారితో మాట్లాడే ఛాన్స్ ఇస్తే కిషన్ రెడ్డి బాగోతం మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. ఇదే తరుణంలో రాజా సింగ్ కు బిజెపి నాయకులు హిందుత్వ వాదులంతా సపోర్ట్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లోకి రాజాసింగ్ వెళ్లడం కుదరదు. కేవలం బీఆర్ఎస్లోకి మాత్రమే కాదు కాంగ్రెస్ లోకి కూడా ఆయన వెళ్లలేరు.. ఆయన కరుడుగట్టిన హిందుత్వవాది కాబట్టి ఈ రెండు పార్టీలలోకి రాజాసింగ్ వెళ్లడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇక తనని మహారాష్ట్ర హిందువులు పిలుస్తున్నారని కూడా ఆ ప్రెస్ మీట్ లో రాజాసింగ్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: