వైసిపి పార్టీ లోక్ సభ పక్ష నేత ఎవరు..? నలుగురు ఎంపీలు ఉన్నారు.. నలుగురిలో ఇప్పటిదాకా లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి. అయితే ఇప్పుడు ఈ నేత జైల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడేమో పార్లమెంట్ సెక్షన్ ప్రారంభమైంది. ఈ పార్లమెంట్ సెక్షన్ సమయంలో తను కార్యక్రమాలు మరి ఎవరు చూడాలి.. లీడ్ ఎవరు చేయాలి అన్న డైలమాలో వైసీపీ ఉంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ గొంతు వినిపిస్తోంది.. లావు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఆయన ఆధ్వరణలోనే జరుగుతోంది.



మంత్రులు ఉన్నప్పటికీ కూడా అటు రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇటు పక్కన పినమనేని ఉన్న.. పెమ్మసాని ఉన్న.. వీరందరూ కూడా లీడ్ కృష్ణదేవరాయలు వ్యవహరిస్తున్నారు. అక్కడ వీళ్ళిద్దరూ మంత్రి సీట్ లో కూర్చుంటారు. టోటల్గా టిడిపి తరఫున అగ్రేసివ్ ,అటాక్ జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే మాత్రం అవినాష్ రెడ్డి ఏమో పెద్దగా మాట్లాడడం జరగదు. తనుజరాని ఇప్పుడిప్పుడే సబ్జెక్టు నేర్చుకుంటోంది. మరి ఇప్పుడు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ కాదు.. క్రిందటి సారి పార్లమెంటు ఎన్నికలలో, 2021 మధ్యంతర ఎన్నికలలో గెలిచారు. కాబట్టి తను ఇప్పుడు సీనియర్ అయినట్టే.


మరి తిరుపతి గురుమూర్తికి ఇస్తారా లీడర్షిప్.. లీడర్షిప్ అనేది డైరెక్ట్ ఇవ్వకుండానే మా పార్లమెంటరీ పార్టీ నేత, మా లోక్సభ పక్ష నేతని ప్రకటించకుండా అతనే న్యాయకత్వం వహిస్తారా.. sc నేత  అయినప్పటికీ కూడా తనకి మంచి టాలెంటెడ్ ఉందని చెప్పవచ్చు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి నటువంటి వ్యక్తికి కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అనౌన్స్ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు.. కాని మిథున్ రెడ్డి
వారు ఏం ఫీల్ అవుతారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నా. ఇదివరకు కూడా రాజు గారి ఫీలింగ్ అదే..  రెండు చోట్ల రెడ్లే తీసుకుంటారని.. అటు విజయ్ సాయి రెడ్డి, ఇటు మిథున్ రెడ్డి  అప్పుడు ఆయన బయటకు వెళ్లడానికి కూడా కారణాలు ఇవే.. మరి ఇప్పుడైతే బయటికి వెళ్లేవారు ఎవరూ లేరు.. కానీ తిరుపతి ఎంపీ గురుమూర్తి మాత్రం మంచి టాలెంటెడ్ వ్యక్తిని.. ఎక్కడ ఎలాంటివి లేవనెత్తాలి, ఎక్కడ కేసులు పెట్టాలి, ఎక్కడ చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి అనే తెలిసిన వ్యక్తి గురుమూర్తి. మరి ఈ నేతకు డైరెక్ట్ గా ఇవ్వకుండా లీడ్ చేసేలా ఇస్తారెమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: