తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ప్రశంసలు పొందే విషయంలో నూటికి నూరు శాతం ఆయన సక్సెస్ అవుతున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ లేఖ రాశారని వెల్లడించిన సంగతి తెలిసిందే.

సోనియా గాంధీ రాసిన లేఖ తనకు ఆస్కార్ లాంటిదని నోబెల్ లాంటిదని  ఆయన చెప్పుకొచ్చారు.  ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినా  సోనియా గాంధీ రాసిన లేఖనే తనకు గొప్ప అని రేవంత్ రెడ్డి అన్నారు.  రాహుల్ గాంధీ ఆత్మతో తన ఆత్మా కలిసిందని అందుకే తాను  ముఖ్యమంత్రి అయ్యానని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ మనసులో అనుకున్న పనులను తాను  చేయాలనీ ఆకాంక్షించానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.  కుల గణన విషయంలో తెలంగాణ మోడల్ గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి కామెంట్లను  కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ప్రధానంగా బీ.ఆర్.ఎస్ నేతలు ఆ లేఖలో  సోనియా గాంధీ సామాజిక న్యాయ సదస్సుకు రాలేనని పేర్కొన్నారని  చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి సోనియా గాంధీ తనను ప్రశంసించినట్టు ఆ లేఖను అడ్డు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కామెంట్లపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.  రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలను మెప్పించే విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: