
బీజేపీ అధ్యక్ష పదవి మార్పు – యోగీ పై నజర్! .. ప్రస్తుతం జేపీ నడ్డా అధ్యక్ష పదవి కాలం ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. అయితే బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరు అనే చర్చలో… యోగి పేరు పక్కాగా వినిపిస్తోంది. ఇది కేవలం మార్పు కోసం మార్పు కాదు. దీనికి కేంద్రంలో మోడీ-షా, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఉన్న చీకటి చాప్టర్ కారణమనే ప్రచారం ఉంది. అమిత్ షా – ఆర్‌ఎస్‌ఎస్ గ్యాప్! .. ఆర్‌ఎస్‌ఎస్ తో అమిత్ షాకు విభేదాలున్నాయన్న వాదనలు పెరిగిపోతున్నాయి. కేంద్రంలో అధికారాన్ని అమిత్ షా పూర్తిగా నియంత్రిస్తున్నారన్న భావన ఉంది. పార్టీ తీరుపై ఆర్‌ఎస్‌ఎస్ అసంతృప్తిగా ఉన్నదని చెబుతున్నారు. అదే కారణంగా ఢిల్లీ సీఎం ఎంపిక విషయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ తన సత్తా చూపిందని అంటున్నారు.
ఒక్క దెబ్బకి రెండు పిట్టల వ్యూహం? .. మోడీ-షాలు యోగిని యూపీ సీఎం పదవి నుంచి తప్పించాలని చాలా కాలంగా చూస్తున్నారట. కానీ ప్రజల్లో ఆయనకు ఉన్న క్రేజ్‌ను కరిగించలేకపోతున్నారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఆయన్ని కట్టబెట్టడం ద్వారా రెండు పనులు పూర్తవుతాయి – ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిని అధ్యక్షుడిని చేయడమే బలమైన మెసేజ్ , యూపీ సీఎం పదవి నుంచి యోగిని శాంతంగా తప్పించడం.. ఇలా అయితే యూపీ పాలనపై పూర్తి నియంత్రణ మళ్లీ మోడీ-షాలకు దక్కుతుంది. ఇక యోగీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారు. యోగి పేరు జాతీయ రాజకీయాల్లో ఈ స్థాయిలో చర్చకు రావడం, ఆయనను జాతీయ అధ్యక్షుడిగా చేయాలనే ప్రచారం ఊహ కాదు. ఇది ఒక పెద్ద వ్యూహం భాగం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా అయితే యూపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందన్నమాట!