- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారేందుకు రాష్ట్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రేపు విజయవాడ నోవాటెల్ హోటల్ లో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ ను చేపడుతోంది. దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడంతో పాటు సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ ను నిర్వహించడం జరుగుతోంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, ముఖ్యమైన అభివృద్ధి భాగస్వాములు హాజరుకానున్నారు. భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ఈ గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా మారనుంది. భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థకు మానవ వనరుల కేంద్రంగా ఎదగనుంది.


వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్య శిక్షణ
పునరుత్పాదక ఇంధన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ నుంచి ఇన్‌స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వరకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కేవలం నైపుణ్య శిక్షణ కార్యక్రమం మాత్రమే మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులకు తగ్గ నైపుణ్యాల అభివృద్ధికి, పరిశ్రమల వృద్ధికి దోహదపడే విధంగా రూపొందించడం జరిగింది. 2030కి 160 గిగావాట్ల సోలార్ మరియు విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణ రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో మాత్రమే కాకుండా గ్లోబల్ టాలెంట్ ఎగుమతిదారుగా కూడా నిలవనుంది. ఈ సమావేశంలో మూడు హై-ఇంపాక్ట్ ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు. సోలార్, విండ్ పరిశ్రమల దిగ్గజాలు.. పాలసీ మేకర్లు, శిక్షణ సంస్థలతో కలిసి డిమాండ్ ఆధారిత, పరిశ్రమల అవసరాలకు తగ్గ వర్క్ ఫోర్స్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ రూపొందించనున్నారు. అదనంగా ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ప్రారంభించనున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: