
ప్రస్తుతం సైతం నేతలు ఇదే పంథాను కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తిరుపతిలో వైసీపీ నేతలు ఒక యువకుడిపై దాడి చేశారని ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దాడులకు చోటు లేదని ఆయన పేర్కొన్నారు. రప్పా రప్పా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు రఫ్ఫాడిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వీడియోను నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. నిన్న రాత్రి తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్ట్ ను తనకు రాసివ్వాలని వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. పవన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి ఎం.ఆర్.పల్లిలోని తన ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారు.
యువకుడిని చితకబాదుతున్న సమయంలో అనిల్ రెడ్డి స్నేహితులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాల గురించి హోమ్ మంత్రి అనిత సైతం తీవ్ర స్థాయిలో ఒకింత ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు చేస్తే కూటమి సర్కార్ ఊరుకోదని అనిత పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఈ ఘాటు కామెంట్ల వల్ల మరింత సంచలనం అవుతున్నాయని అభిప్రాయాలూ వ్యక్తమవుతూన్నాయి. నారా లోకేష్ భవిషత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.