వైసిపి 2019-2024 మధ్య ఐదేళ్లపాటు కొనసాగిన ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందనే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ముఖ్యంగా అందులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర కూడా ఉందని ఛార్జ్ షీట్ల సీట్ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా అప్పటి సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే పైన వివరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని నడిపించారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన అంశాలను చార్జిషిట్లో సీట్ అధికారులు పేర్కొన్నారు.


మద్యం కుంభకోణంలో.. విశ్రాంత ఐపీఎస్ అధికారి కాల్వ ధనంజయ రెడ్డి A -31 , జగన్ ఓఎస్డీ  కృష్ణ మోహన్ రెడ్డి A -32, అలాగే భారతి సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప A -33 ప్రమేయం ఉందని సిట్ అధికారులు అభియోగాలను తెలియజేశారు. ఇందుకు సంబంధించి నిన్నటి రోజున సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రాలను కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 124 పేజీలు 16 పైగా వాల్యూమ్లతో వీటిని సమర్పించారు. అలాగే ప్రాథమిక అభియోగపత్రంలో గతంలో 7 వ్యక్తులు 9సంస్థల పైన కూడా అభియోగాలను మోపారు. అందులో ఇప్పుడు తాజాగా ముగ్గురు నిందితుల పైన సిట్ అధికారులు అభియోగాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.


ఇక వీరికి సంబంధించిన లావాదేవులో విషయాలపై డొల్ల కంపెనీకి సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలను కూడా పొందుపరిచినట్లు సమాచారం. రూ.3,500 కోట్ల విలువైన వాటికి ఆర్థిక నేరానికి పాల్పడ్డారు అంటూ లోతుగా విచారిస్తున్నారు. ఈ కుంభకోణంలో కీలకమైన పాత్రధారులుగా వాసుదేవ రెడ్డి A2, సత్య ప్రసాద్ A3 ఉన్నారు. అలాగే ఆనాడు ముఖ్యమంత్రి సలహాదారునిగా ఉన్న అజయ్ కల్లం కూడా ఈ చార్జి  సీట్లో విచారించబోతున్నారు.

ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే ఈ మద్యం  విధానంలో మార్పులకు నిర్ణయాలు తీసుకున్నారని.. 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాలకు కొనసాగింపు లైసెన్సులను కూడా ఇచ్చారని 2019 జూన్ 21న మార్పుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలా 2019 అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వాలు నడిపే వీలుగా అమలు చేశారని తెలిపారు. అలా 3500 రిటైల్ దుకాణాలను నిర్వహించేందుకు అనుమతులు జారీ చేశారు... వీరికి అవసరమైన చోట అవసరమైన మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేసుకున్నారు..A2 గా ఉన్న వాసుదేవరెడ్డి బేవ రేజన్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నారు. ఇది అప్పటి ప్రభుత్వానికి కొంతమంది అధికారులకు అండగా నిలిచిందట.


బేవ రేజస్ కార్పొరేషన్ లో అక్రమాలు జరుగుతున్నట్టుగా ప్రత్యక్ష ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ సిట్ విచారణలో.. వాసుదేవరెడ్డి, సత్యప్రసాదుల పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పైన ఒత్తిడి చేసినట్లుగా తెలియజేశారు. ఇలా ఎన్నో అక్రమాలు జరుగుతున్నట్లుగా ఉన్నతాధికారులకు 2022 నాటికి తెలిసినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదని.. అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి పైన బేవ రేజస్ కార్పొరేషన్ పైన అక్రమాల పైన ఎలాంటి మెమోలు ఇవ్వకూడదని ఆదేశాలను పరిగణంలోకి తీసుకుంటే ఈ కుంభకోణంలో కూడా పూర్తిస్థాయిలో చాలామంది భాగస్వాములు అయ్యారని విషయం తేలుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: