ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  మద్యం కుంభ కోణం సంచలనం సృష్టించింది. జగన్ ప్రభుత్వ హయాం లో జరిగినటువంటి ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా  మిథున్ రెడ్డి ఉన్నాడంటూ  ఇప్పటికే నిర్ధారించారు. అంతేకాదు మిథున్  రెడ్డిని జైలు కి కూడా పంపించారు. అలాంటి మిథున్ రెడ్డికి   మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈయన జగన్ రెడ్డికి విద్యావ్యవస్థ లో రాజకీయ వ్యవస్థలో మంచి మిత్రుడు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట ఉంటూ ప్రతిదాంట్లో చేదోడు వాదోడుగా ఉంటూ జగన్ ఎదిగేలా చేశారని చెప్పవచ్చు. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి..ప్రముఖ పారిశ్రామికవేత్త లోక్ సభ సభ్యుడు. 

అలాంటి పెద్ద పదవుల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని లిక్కర స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఇదే తరుణంలో మిథున్ రెడ్డి దగ్గరికి ఈనెల 25వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఆయన మిథున్ రెడ్డితో మూలాకత్ కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లని జరుగుతున్నాయట. ఈ విధంగా లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి పై ఆరోపణలు వస్తే జగన్ దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నారు.

లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, ప్రభుత్వం  ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఇది తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు. మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన ఇలాంటి స్కామ్ ఎందుకు చేస్తారని వెనకేసుకొచ్చారు. 2014 నుంచి 19 లిక్కర్ పాలసీ పై నమోదైన కేసుల్లో చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నారని, మా ప్రభుత్వ హయాంలో మూసివేసిన బెల్ట్ షాపులు మళ్ళీ తెరుచుకుంటున్నాయని  జగన్ ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ మిథున్ రెడ్డిని కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: