నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా సంచలనం అయిన సంగతి తెలిసిందే.  అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పెరోల్ వ్యవహారం గురించి వాడీవేడి చర్చ జరుగుతోంది. నెల్లూరు రురల్  టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వివాదంలో జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విమర్శల గురించి ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వివాదం గురించి కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై సీరియస్ అయ్యారు.  శ్రీకాంత్ తండ్రి తన దగ్గరకు వచ్చాడని  ఆయనకు నేను సిఫార్సు లేఖ ఇచ్చానని ఈ విషయంలో ఎలాంటి అవాస్తవాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆ  సిఫార్సు లేఖలను తిరస్కరించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సిఫార్సు లేఖలను తిరస్కరించిన రెండు వారాల  తర్వాత  శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడం జరిగిందని కోటంరెడ్డి వెల్లడించారు.

అయితే దీని వెనుక ఏం జరిగిందో తాను విచారిస్తామని హోమ్ మినిష్టర్ వంగలపూడి అనిత ప్రకటించారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సైతం కొందరు నేతలు శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ఆ లేఖల వల్ల అప్పట్లో శ్రీకాంత్ కు పెరోల్ వచ్చిందని కోటంరెడ్డి తెలిపారు.  

తాను  ఎమ్మెల్యేగా కొనసాగినంత కాలం పెరోల్ కోసం సిఫార్సు లేఖలను తాను  ఇవ్వనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడం కొసమెరుపు.  మరి రాబోయే రోజుల్లో కోటంరెడ్డి ఈ కామెంట్లపై నిలబడతారో చూడాల్సి ఉంది. శ్రీకాంత్ వివాదంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. పొలిటికల్ నేతలు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి.  రాజకీయ నేతలు తమపై విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: