
కేటీఆర్ ను కలవాలి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డినీ అడగాలా అంటూ ప్రశ్నించారు? అంతేకాకుండా ఆయనని ఎందుకు కలవకూడదు అంటూ ప్రశ్నిస్తూ గతంలో కూడా తాను ఎన్నో సందర్భాలలో కేటీఆర్ ని కలిసానంటూ గుర్తు చేశారు నారా లోకేష్. ప్రస్తుతం తెలంగాణలో టిడిపి పార్టీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో టిడిపి పార్టీ అభ్యర్థిపై చంద్రబాబుదే తుది నిర్ణయం అంటూ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నది.. ఒకవేళ టిడిపి అభ్యర్థి బరిలో ఉంటే మాత్రం సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవలే మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కవితను టిడిపి పార్టీలోకి చేర్చుకుంటారా? ప్రశ్నించగా.. కవిత టిడిపి పార్టీలో చేర్చుకుంటే జగన్ని చేర్చుకున్నట్లే అంటూ వ్యాఖ్యానించారు. ఇక రెడ్ బుక్ విషయం గురించి మాట్లాడుతూ రెడ్ బుక్లో చాలా స్కాములు ఉన్నాయంటూ నారా లోకేష్ తెలిపారు. ఇవన్నీ బయటికి వస్తాయని భయంతోనే మాజీ సీఎం జగన్ బెంగళూరులోనే ఉంటున్నారు అంటూ విమర్శించారు. ఎవరి మీద ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు తాము చేయలేదంటూ తెలిపారు మంత్రి నారా లోకేష్.