తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వెలుబడిన నోటిఫికేషన్స్ ప్రక్రియకు సంబంధించి పూర్తి అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 60 వేలకు పైగా నియామకాలను పూర్తి చేసే పనిలో పడింది. ఇందులో భారీ సంఖ్యలో 25 వేల పోస్టులకు ఆర్థిక శాఖ మంత్రి అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. ఉద్యోగ ప్రకటనలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తి కాకపోవడం వల్ల కొంతమేరకు ఆలస్యం అయినట్లు తెలుపుతున్నారు.



ఈ ఏడాది డిసెంబర్ కి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలలో 25 వేల పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో 12వేల పోస్టులు ఉన్నట్లు డీజీపీ శశిధర్ రెడ్డి తెలియజేశారు. ఇందులో అత్యధికంగా సివిల్ భాగంలోని 8000 వేల పోస్టులకు పైగా ఉన్నాయట. విద్యుత్ రంగంలో 3000 ఖాళీలు, టీచర్ పోస్టులు, డిప్యూటీ DEO, డైట్ బీఈడీ కాలేజీ లెక్చరర్ పోస్టులను, గ్రూప్స్ కు సంబంధించి గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలకు, వైద్యరంగంలో నియామకాలు చేపట్టడానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నిటికీ సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చిందని వీటికి సంబంధించి కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇటీవల నియామకాలలో పూర్తిగా బ్యాక్ లాగ్  ఖాళీలు 4వేలకు పైగా ఉన్నాయని.. ఒక గురుకుల నియామక బోర్డు పరిధిలోని సుమారుగా 2000 పోస్టులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు, అలాగే గ్రూప్ 4లో కూడా ఖాళీగా ఉన్నాయని వీటన్నిటిని కలిపి జాబ్ క్యాలెండర్లో కేటగిరీలు వారిగా పోస్టులకు సంబంధించి విడుదల చేయడానికి ప్రక్రియ కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తోంది. త్వరలోనే 25 వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: