రీసెంట్ గా అక్టోబర్ 4 న చెన్నైలో 1980's లో మెరిసిన తారలందరూ ఒకే చోట రీ యూనియన్ ని సెలబ్రేట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే గత కొద్ది సంవత్సరాల నుండి సౌత్ ఇండస్ట్రీ నటీనటులు ఒకే దగ్గర కలిసి ఈ రీ యూనియన్ ని చేసుకుంటున్నారు.ఇక గత ఏడాది జరగాల్సిన ఈ రీ యూనియన్ చెన్నైలోని వరదల కారణంగా ఈ ఏడాది పెట్టుకున్నారు. అయితే ఈ రీ యూనియన్ సెలబ్రేషన్స్లో దాదాపు 31 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.కానీ 80స్ లో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన ఓ ఇద్దరు హీరోస్ మాత్రం కనిపించలేదు. వాళ్లే టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల్లో ఒకరైనటువంటి నాగార్జున, బాలకృష్ణ. ఈ ఇద్దరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ రీ యూనియన్ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదు.. ఇక ఆ మధ్యకాలంలో చిరంజీవిని బాలకృష్ణ విమర్శిస్తూ నన్ను రీ యూనియన్ పార్టీకి పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు.

 అయితే ఇండస్ట్రీలో ఉండే బాలకృష్ణ,చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ మధ్య ఎప్పుడూ పోటీ తత్వం ఉండేది. కానీ బయట ఎక్కడ కనిపించినా కూడా ప్రేమగా మాట్లాడుకునేవారు  ఒక బాలకృష్ణ నాగార్జున మధ్య కోల్డ్ వార్ ఉంది తప్ప మిగిలిన వారందరితో బాగానే ఉండేవారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ 80's రీ యూనియన్ కి బాలకృష్ణ ఎందుకు రావడం లేదు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇక బాలకృష్ణ చిరంజీవి మధ్య బయటికి సఖ్యతగా ఉన్నట్టు కనిపించినప్పటికీ లోపల మాత్రం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్ గాని ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని విమర్శిస్తూ ఆయనపై సెటైర్ వేసినట్టుగా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. దాంతో చిరంజీవి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై రీకౌంటర్ ఇచ్చారు.

ఇక వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే ఈ రీ యూనియన్ కి పిలుచుకోలేదు అంటే ఓకే కానీ నాగార్జున ఎందుకు రావడం లేదు అనే డౌట్ మరి కొంత మందికి వస్తుంది. ఇక నాగార్జున చిరంజీవితో బాగానే ఉంటారు కదా..అలాగే వెంకటేష్ బంధువు కూడా కదా.. ఎందుకు రావడం లేదని కూడా అనుమానం వస్తుంది. కానీ వెంకటేష్ నాగార్జున మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ కూడా ఉంది. ఇప్పటి వరకు నాగార్జున ఒక్కసారి కూడా రీ యూనియన్ లో కనిపించలేదు. మరి వీరి మధ్య కోల్డ్ వార్ వల్లే ఈ ఇద్దరు హీరోలు రీ యూనియన్ కి రావడం లేదా..లేక వేరే పనుల్లో బిజీగా ఉండి రావడం లేదా అనేది మాత్రం తెలియదు. ఇక ఈసారి ఈ రీ యూనియన్ సెలబ్రేషన్స్ లో మలయాళం నటుడు మోహన్ లాల్ కూడా మిస్ అయ్యారు. అయితే ఈయన ప్రతిసారి ఈ రీ యూనియన్ లో పాల్గొంటారు. కానీ ఈసారి మాత్రం మిస్ అయ్యారు.బహుశా వేరే ఏదైనా సినిమా షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయారు కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: