టాలీవుడ్ తెరపై దశాబ్దానికి పైగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న అందాల నాయికల్లో రాశి ఖన్నా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన రాశి ఖన్నా, ఇప్పుడు పూర్తిగా స్లిమ్ లుక్‌లోకి మారిపోయి మరింత గ్లామరస్‌గా దర్శనమిస్తున్నారు. అయితే, ఈ అందాల రాశి కొత్త గ్లామర్ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనే ప్రశ్నకు ఆమె నుంచి చాలా ఆసక్తికరమైన సమాధానం వినిపిస్తోంది.

తన గ్లామర్ లుక్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ రాశి ఖన్నా కీలక విషయాలు పంచుకున్నారు. తాను ఇష్టమైన ఫుడ్స్ అన్నీ మానేయలేదని, కాకపోతే తక్కువ మొత్తంలో మాత్రమే తింటానని ఆమె తెలిపారు. "నేను గతంలో పరాఠా, మఖాన్ చాలా బాగా తినేదాన్ని. ఇప్పుడు కూడా తింటాను. కానీ నా లైఫ్‌లో జిమ్ ఒక భాగంగా మారింది" అని ఆమె అన్నారు.

డైట్ విషయంలో తాను పెద్దగా మార్పులు చేయలేదని, కేవలం తీసుకునే ఆహారం మోతాదును తగ్గించానని రాశి ఖన్నా వెల్లడించారు. "ప్రస్తుతం నేను ఒక మధ్యస్థమైన ఫిజిక్‌తో ఉన్నాను. ఇకపై కూడా అదే లుక్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తాను" అని ఆమె తెలిపారు. జిమ్‌తో పాటు ఆహారం మోతాదు తగ్గించడమే తన స్లిమ్ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యమని రాశి ఖన్నా స్పష్టం చేశారు. ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా దూరం చేసుకోకుండానే, పరిమితంగా తింటూ ఫిట్‌గా ఉండవచ్చని ఆమె నిరూపించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: